- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరుస హిట్లు కొట్టినా అమ్మడుకి కలిసి రాని అదృష్టం.. ఇండస్ట్రీకి దూరం కాక తప్పదా?
సినిమా అవకాశాలు తగ్గడంతో ప్రగ్యా తన రూట్ మార్చింది. ప్రస్తుతం ఈమె తన పూర్తి ఫోకస్‌ను సోషల్ మీడియాపై పెట్టింది.

దిశ, సినిమా: టాలీవుడ్‌లో ఒక్క సినిమా హిట్టయితే చాలు.. హీరోయిన్ల దశ తిరిగిపోతుంది. కానీ, కొందరికి అదృష్టం మాత్రం అంత ఈజీగా తలుపు తట్టదు. ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal)విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు తన ఖాతాలో ఉన్నా, అవకాశాల విషయంలో మాత్రం ఈ అమ్మడు వెనుకబడిపోయింది. టాలీవుడ్‌లో ‘కంచె’ సినిమాతో పద్ధతిగా ఎంట్రీ ఇచ్చి అందరినీ మెప్పించిన భామ ప్రగ్యా జైస్వాల్. ఆ తర్వాత ‘నక్షత్రం’ వంటి చిత్రాల్లో తన గ్లామర్ యాంగిల్ కూడా చూపించింది. ఇక బాలయ్యతో చేసిన ‘అఖండ’ సినిమా ఆమె కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. 2025 సంక్రాంతికి విడుదలైన ‘డాకు మహారాజు’(Daku Maharaja) తో పాటు ఇటీవల విడుదలైన ‘అఖండ-2’ లోనూ కనిపించి మెప్పించింది. ఇన్ని పెద్ద హిట్లు ఉన్నా, ప్రగ్యాకు కొత్త ప్రాజెక్టులు రాకపోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సినిమా అవకాశాలు తగ్గడంతో ప్రగ్యా తన రూట్ మార్చింది. ప్రస్తుతం ఈమె తన పూర్తి ఫోకస్‌ను సోషల్ మీడియాపై పెట్టింది.
నిత్యం ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటూ, గ్లామరస్ ఫొటో షూట్లతో నెటిజన్లకు నిద్ర లేకుండా చేస్తోంది. తాజాగా, గోల్డ్ కలర్ డ్రెస్‌లో మెరిసిపోతూ షేర్ చేసిన హాట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తన అందచందాలతో దర్శకనిర్మాతలను ఆకర్షించి, కొత్త అవకాశాలు దక్కించుకోవాలని ప్రగ్యా గట్టిగానే ప్రయత్నిస్తోంది.ప్రగ్యా పరిస్థితి చూసి ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క సినిమా హిట్ అయిన వాళ్లకే చేతినిండా సినిమాలు ఉంటుంటే.. మూడు భారీ హిట్లు ఉన్న ప్రగ్యాకు ఎందుకు అవకాశాలు రావడం లేదు? అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు అయితే, ఇలాగే గ్యాప్ వస్తే ఆమె ఇండస్ట్రీకి దూరం కాక తప్పదేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అఖండ వంటి మాస్ హిట్స్ పడినా ఆమెకు టైమ్ కలిసి రాకపోవడం నిజంగా షాకింగ్ అని చెప్పాలి. మొత్తానికి ప్రగ్యా జైస్వాల్ తన హాట్ ఫొటోలతో వార్తల్లో నిలుస్తూ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అందాలు ఏమాత్రం తగ్గకపోయినా, అదృష్టం మాత్రం ఈ అమ్మడికి అల్లంత దూరంలోనే ఉంది.






