- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్ సీజన్2 వచ్చేస్తోందా!
ప్రియదర్శి, అభినవ్ గోమటం, కృష్ణ చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన ‘సేవ్ ది టైగర్స్’ తొలి సీజన్ మంచి సక్సెస్ అందుకుంది.

దిశ, సినిమా: ప్రియదర్శి, అభినవ్ గోమటం, కృష్ణ చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన ‘సేవ్ ది టైగర్స్’ తొలి సీజన్ మంచి సక్సెస్ అందుకుంది. తేజ కాకుమాను దర్శకత్వంలో తెరక్కెకిన ఈ సిరీస్ మూడు జంటల కథలతో ఎంటర్‌టైనింగ్‌గా చూపించారు. భార్యాభర్తల బంధంలోని ప్రేమ, పరస్పర గౌరవం, నమ్మకం ఉన్నప్పుడే ఆ బంధం నిలబడుతుంనే ఆంశాన్ని సింపుల్ ఎమోషన్స్‌తో వినోదాత్మకంగా చూపించాడు దర్శకుడు.
ఇక ఈ వెబ్ సిరీస్ ఎండ్‌లో ప్రియదర్శి, అభినవ్ గోమటం, కృష్ణ చైతన్య పీకలదాకా తాగి ఓ కిడ్నాప్ చేస్తూ దొరికిపోతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది రెండో సీజన్‌లో చూపించిబోతున్నట్లుగా హింట్ ఇచ్చారు. అయితే ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన సీజన్ 2 ఆగస్టు మూడో వారంలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. కానీ దీనిపై మేకర్స్, హాట్‌స్టార్ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Read Also..
నేలపై కూర్చుని భోజనం చేయడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనా ఉన్నాయో తెలుసా..!






