అతనితో గర్భం దాల్చానని తెలిసినా పెళ్లి చేసుకుంటానన్నాడు: నీనా గుప్తా

by Disha Web Desk 13 |
అతనితో గర్భం దాల్చానని తెలిసినా పెళ్లి చేసుకుంటానన్నాడు: నీనా గుప్తా
X

దిశ, సినిమా: నటుడు, చిత్రనిర్మాత సతీష్ కౌశిక్ ఆకస్మిక మరణం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తీరని లోటు మిగిల్చింది. అయితే ఆయన మరణానంతరం సహనటి నీనాగుప్తాకు ఓ ఆఫర్ ఇచ్చిన విషయం వైరల్ అవుతోంది. ఈ మేరకు ‘జానే భీ దో యారో’అనే సినిమాలో నినా, సతీష్ కలిసి నటించగా ఈ సినిమాతో వారిద్దరి స్నేహం బలపడింది. అయితే తమ బంధం గురించి ఇటీవల నీనా గుప్తా తను రాసిన ‘సచ్ కహున్ తో’అనే ఆత్మకథలో వివరిస్తూ.. ‘క్రికెటర్ వివ్ రిచర్డ్స్‌తో డేటింగ్‌లో ఉన్నపుడు నేను గర్భం దాల్చాను. ఈ విషయం ఎవరికీ తెలియదు. కొన్ని కారణాల వల్ల మేము పెళ్లి వరకూ వెళ్లలేకపోయాం.

దీంతో స్నేహితుడు సతీష్ నాకు సాయం చేయడానికి ముందుకొచ్చాడు. ‘మీరు చింతింకండి నేను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నిన్ను పెళ్లిచేసుకుని నీ బిడ్డకు తండ్రినవుతా. ఒకవేళ పిల్లవాడు నల్లటి చర్మంతో పుడితే నా కొడుకు అని చెప్పండి. ఎవరూ అనుమానించరు. మై హూ నా, తూ చింతా క్యు కార్తీ హై..?’ అన్నాడు’ అని నినా వివరించింది. చివరగా ‘నన్ను ఒంటరిగా చూడలేక ఆందోళన చెందిన సతీష్.. పెళ్లి చేసుకోవాలనే తన ప్రతిపాదన నాకు మద్దతునివ్వడంతోపాటు హాస్యం, ఆందోళన, గౌరవంగా అనిపించిందని తెలిపింది.

Next Story

Most Viewed