నేడు చెన్నైలో శరత్ బాబు అంత్యక్రియలు

by Disha Web Desk 4 |
నేడు చెన్నైలో శరత్ బాబు అంత్యక్రియలు
X

దిశ, వెబ్‌డెస్క్: సినీ నటుడు శరత్ బాబు(71) అంత్యక్రియలు నేడు చెన్నైలో జరగనున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. శరత్ బాబు భౌతిక కాయాన్ని ఫిల్మ్ ఛాంబర్ కు తరలించారు. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు నివాళులు అర్పించారు. అనంతరం ఆయన పార్థీవ దేహాన్ని సోమవారం రాత్రి 7గంటలకు చెన్నైకి తరలించారు. ఆయన మృతి పట్లు తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్, తెలంగాణ గవర్నర్ తమిళిసై, టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లు సంతాపం తెలిపారు. సీనినటులు మురళిమోహన్, శివాజీరాజా ఏఐజీ వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు.

Read More: ‘శరత్ బాబు సిగరేట్ కాల్చొద్దు అనేవారు’

శరత్ బాబు మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు.. ప్రధాని మోడీ

Advertisement

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Read Disha E paper
👉 Follow us on Google News
👉 Follow us on whatsapp channelNext Story

Most Viewed