మొన్న రష్మిక.. ఇవాళ స్టార్ క్రికెటర్ కుమార్తె.. కౌగిలించుకున్నట్లుగా ఏఐ డ్యామేజ్

by Disha Web Desk 9 |
మొన్న రష్మిక.. ఇవాళ స్టార్ క్రికెటర్ కుమార్తె.. కౌగిలించుకున్నట్లుగా ఏఐ డ్యామేజ్
X

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ రష్మిక ఫేస్ మార్ఫింగ్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియోపై కల్వకుంట్ల కవితతో పాటు పలువురు రాజకీయ వేత్తలు, మంత్రులు సినీ సెలబ్రిటీలు స్పందించి.. దీనికి కారకులేవరో తెలిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. తాజాగా ఈ వీడియోలో ఉన్న రియల్ ఉమెన్ జారా పటేల్.. ‘ఆ వీడియో నాదే కానీ రష్మిక మందన్నా ఫేస్‌ను ఎవరూ మార్ఫింగ్ చేశారో నాకు తెలియదు.’ అని చెప్పుకొచ్చింది.

ఈ సంఘటన జరిగి మూడు రోజులు కాకముందే ఇవాలా స్టార్ క్రికెటర్ కుమార్తె.. సారా టెండూల్కర్, శుభ్ మాన్ గిల్ సెలబ్రిటీల ఫేక్, వీడియోలు వైరల్ అవుతున్నాయి. సారా తన సోదరుడు అర్జున్‌తో దిగిన పిక్‌ను కొందరు దుండగులెవరో దాన్ని మార్ఫింగ్ చేసి శుభ్ మన్గిల్ ఫొటోను యాడ్ చేశారు. ఇందులో సారా శుభ్ మన్‌ను సైడ్‌ నుంచి కౌగిలించుకున్నట్లు ఉంది. ప్రస్తుతం ఈ పిక్ చూసిన సచిన్ టెండూల్కర్ అభిమానులు మండిపడుతున్నారు.





Next Story

Most Viewed