ఆయనతో పనిచేయాలనేది నా డ్రీమ్.. ఇన్నాళ్లకు నెరవేరింది

by Disha Web Desk 10 |
ఆయనతో పనిచేయాలనేది నా డ్రీమ్.. ఇన్నాళ్లకు నెరవేరింది
X

దిశ, సినిమా : షారుఖ్ ఖాన్‌తో స్ర్కీన్ షేర్ చేసుకోవడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది సన్యా మల్హోత్రా. ప్రస్తుతం బాద్‌షా నటిస్తున్న ‘జవాన్’లో ఓ కీ రోల్ పోషిస్తున్న ఆమె.. వెండితెరపై ఆయన పక్కన కనిపించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అవకాశం ఇన్నాళ్లకు దక్కడం ఆనందంగా ఉందన్న నటి.. ‘షారూఖ్ ఖాన్‌తో ఏదో ఒకరోజు కలిసి పనిచేయాలని కోరుకున్నాను. ఇన్నాళ్లకు నా జీవితంలో ఒక కల నిజమైంది. ‘జవాన్’లో నాదొక డ్రీమ్ రోల్. నాకు ఇదొక డ్రీమ్ ఫిల్మ్. ఇందులో అతని చుట్టూ ఉండటం నిజంగా సంతోషాన్నిస్తుంది’ అని దంగల్ బ్యూటీ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి: ‘ఆది పురుష్’ కాదు.. ‘సలార్’ కావాలంటున్న ప్రభాస్ ఫ్యాన్స్!

ఎవరి సపోర్టుతో వచ్చినా.. సత్తాచూపకపోతే ఔటే: నెపోటిజంపై దివ్యా

ఏదైనా రహస్యంగానే చేయాలి.. లేదంటే నాశనమే: ఛార్మీ


Next Story

Most Viewed