- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీ మెట్రోలో నటికి లైంగిక వేధింపులు.. అబ్బాయిలు గుంపుగా దాడిచేశారట
కాలేజీ రోజుల్లో తనకు ఎదురైన లైంగిక వేధింపుల సంఘటనను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయింది సన్యా మల్హోత్రా. ఈ మేరకు ఓసారి ఢిల్లీ మెట్రోలో కొంతమంది అబ్బాయిల గుంపు తనను కాసేపు ఆటపట్టించినట్లు చేస్తూ అసభ్యంగా

X
దిశ, సినిమా: కాలేజీ రోజుల్లో తనకు ఎదురైన లైంగిక వేధింపుల సంఘటనను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయింది సన్యా మల్హోత్రా. ఈ మేరకు ఓసారి ఢిల్లీ మెట్రోలో కొంతమంది అబ్బాయిల గుంపు తనను కాసేపు ఆటపట్టించినట్లు చేస్తూ అసభ్యంగా తాకేందుకు ప్రయత్నించారని చెప్పింది. అయితే ఆ సమయంలో తనతోపాటు చాలామంది జనాలు ఉన్నప్పటికీ ఎవరూ తనకు సహాయం చేయడానికి ముందుకు రాలేదని వాపోయింది. దీంతో నిస్సహాయంగా మిగిలిపోవడం తప్పా తానేమీ చేయలేకపోయానని, దాని గురించి తర్వాత ఎవరికైనా చెబితే తనకే ఏదైనా చెడు జరగవచ్చునని భావించి సైలెంట్ అయిపోయానని చెప్పుకొచ్చింది. అయితే ఇప్పటికీ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నందుకు బాధగా ఉందన్న నటి మహిళలే ఒంటరిగా పోరాడటం నేర్చుకోవాలని సూచించింది.
Read More: దీపికతో ఆ పని చేయాలనుంది.. ఆమె నాకు బాగా నచ్చింది: గేల్
Next Story






