ఆ సినిమా గురించి నన్ను ఏమీ అడగొద్దు.. సన్యా షాకింగ్ కామెంట్స్

by Disha Web Desk 7 |
ఆ సినిమా గురించి నన్ను ఏమీ అడగొద్దు.. సన్యా షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: షారుఖ్ సినిమా ‘జవాన్’లో తన క్యారెక్టర్ గురించి అడిగిన ప్రశ్నలకు సన్యా మల్హోత్రా ఆసక్తికర సమాధానాలు చెప్పింది. షారుఖ్, నయనతార ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈ మూవీలో కీ రోల్ పోషిస్తున్న సన్యా.. సినిమాలో తన పాత్ర గురించి మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేయక ముందే కొంతమంది అనేక ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారని తెలిపింది.

నిజానికి తనకు ఈ మూవీలో అవకాశం ఉందో లేదో స్పష్టంగా తెలియక ముందే ఈ ప్రచారం జరిగిందని.. మూవీ యూనిట్‌ను కలిసినందుకే బిగ్ చాన్స్ కొట్టేసిందని వార్తలు వచ్చాయని చెప్పుకొచ్చింది. మొత్తానికి ఇప్పుడు తాను ‘జవాన్’లో నటిస్తున్న విషయాన్ని ప్రజలందరికీ నిర్భయంగా చెప్పగలనన్న నటి.. సినిమా విడుదలకు ముందే ఎలాంటి వివరాలు అడగొద్దంటూ ఫన్నీగా చెప్పుకొచ్చింది.

Read More: ఇక్కడ తప్ప.. మరెక్కడ అలాంటి అనుభూతి పొందలేరు: రాధిక

‘నేను స్టూడెంట్ సర్’ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది: అవంతిక

Next Story