నేను అలా చేయలేను.. అమీర్-షారుఖ్ మూవీస్‌పై సన్యా ఇంట్రెస్టింగ్ పోస్ట్

by Disha Web Desk 6 |
నేను అలా చేయలేను.. అమీర్-షారుఖ్ మూవీస్‌పై సన్యా ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

దిశ, సినిమా : బీటౌన్ బ్యూటీఫుల్ యాక్ట్రెస్ సన్యా మల్హోత్రా తను నటించిన ‘దంగల్’ అండ్ ‘జవాన్’ సినిమాల వ్యత్యాసంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ మేరకు తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆస్క్ మి ఎనీథింగ్ సెషన్ నిర్వహించిన ఆమె.. తన కెరీర్‌లో స్పోర్ట్స్ డ్రామా ‘దంగల్‌’తర్వాత రెండవ అతిపెద్ద చిత్రం ‘జవాన్’గా పేర్కొంది. అలాగే ఓ అభిమాని దంగల్ అండ్ జవాన్‌లలో బాగా నచ్చిన సినిమాను ఎంచుకోమని అడిగాడు. దీంతో వెంటనే షాక్ అయిన నటి.. ‘ఆ పని నేను చేయలేను’ అంటూ తన వేలిని అడ్డంగా ఊపుతూ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో ధనవంతులను దోచి పేదలకు సహాయం చేస్తున్న షారుఖ్ గ్యాంగ్‌లో చేరి ఓ మిషన్‌లో భాగంగా అతనికి సహాయం చేసే సీన్ బాగా నచ్చిందని చెప్పింది. అంతేకాదు ఇందులోని తనకు సంబంధించిన ఓ ఎమోషనల్ సీన్ తనను అభిమానులకు మరింత దగ్గర చేసిందని, అట్లీ ప్రోత్సహంతో కఠినమైన స్టంట్స్ చేయడం తనలో మరింత ఉత్సహం నింపిందంటూ పలు విషయాలు చర్చించింది.

Next Story

Most Viewed