- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘సూర్య-46’ లో అన్ని ఎమోషన్స్ ఉంటాయి.. మరో సంజయ్ రామస్వామిని చూస్తారంటూ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(suriya) వరుస సినిమాల్లో నటిస్తున్నప్పటికీ హిట్ అందుకోలేకపోతున్నారు.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(suriya) వరుస సినిమాల్లో నటిస్తున్నప్పటికీ హిట్ అందుకోలేకపోతున్నారు. అయినప్పటికీ హిట్ ఫ్లాప్ అని ఆలోచించకుండా తనకు నచ్చిన కథలను ఒకే చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకీ అట్లూరి(Venky Atluri) దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ‘సూర్య-46’ వర్కింగ్ టైటిల్‌తో రాబోతుంది. ఇక ఇందులో సూర్య సరసన మలయాళ బ్యూటీ మమిత బైజు(Mamita Baiju) హీరోయిన్‌గా నటిస్తుండగా.. రవీనా టాండన్(Raveena Tandon), రాధిక కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఇక ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ‘సూర్య-46’ మూవీ జూలైలో షూటింగ్ కూడా స్టార్ట్ కాబోతుంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వెంకీ అట్లూరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘‘చాలా రోజుల తర్వాత హ్యాపీ ఫ్యామిలీ సినిమాలో సూర్యను చూడబోతున్నారు. ఇందులో అన్ని ఎమోషన్స్ కలిగి ఉంటాయి. హీరో కామన్ మ్యాన్‌లా ఉండండు.. మరో సంజయ్ రామస్వామి క్యారెక్టర్‌లో సూర్యను చూస్తారు’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






