రామ్ చరణ్ కోసం సంజయ్ లీలా భన్సాలీ మాస్టర్ ప్లాన్.. ఇండస్ట్రీని షేక్ చేసే జంగిల్ అడ్వెంచర్ సిద్ధం!

by Mallepaka Hamsa |

రచయిత దుర్గేష్ సింగ్ ఆ ఐడియాను తీసుకుని రామ్ చరణ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఒక పూర్తి స్థాయి పీరియాడిక్ థ్రిల్లర్‌గా డెవలప్ చేశారట.

రామ్ చరణ్ కోసం సంజయ్ లీలా భన్సాలీ మాస్టర్ ప్లాన్.. ఇండస్ట్రీని షేక్ చేసే జంగిల్ అడ్వెంచర్ సిద్ధం!
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ కాంబినేషన్‌లో ఒక భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ సిద్ధమవుతోందన్న వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ‘RRR’తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన చరణ్, విజువల్ వండర్స్‌ను సృష్టించే భన్సాలీ చేతులు కలిపితే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని అందరూ భావిస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ గురించి అందుతున్న సమాచారం ప్రకారం.. ఇది ఒక హిస్టారికల్ జంగిల్ అడ్వెంచర్ డ్రామా అని తెలుస్తోంది. దీని వెనుక ఒక ఆసక్తికరమైన నేపథ్యం ఉందట. నిజానికి, ఈ కథకు మూలం ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ‘రౌడీ రాథోడ్ 2’ కోసం రాసుకున్న ఒక ఐడియా అని టాక్. అయితే అది ఆశించిన విధంగా రూపుదిద్దుకోకపోవడంతో, ‘గుల్లక్’ ఫేమ్ రచయిత దుర్గేష్ సింగ్ ఆ ఐడియాను తీసుకుని రామ్ చరణ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఒక పూర్తి స్థాయి పీరియాడిక్ థ్రిల్లర్‌గా డెవలప్ చేశారట.

గతంలో వీరిద్దరూ ‘లెజెండ్ ఆఫ్ సుహెల్ దేవ్’ అనే కథపై చర్చలు జరిపారు కానీ, ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. ఇప్పుడు ఈ సరికొత్త అడ్వెంచర్ స్క్రిప్ట్‌తో చరణ్‌ను మెప్పించాలని భన్సాలీ పట్టుదలగా ఉన్నట్లు సమాచారం. ఎలాగైనా ఆయనతో సినిమా చేయాలని పలు విధాల ప్రయత్నాలు చేస్తున్నారట. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ మూవీకి సంబంధించిన పోస్టులు మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇక అది చూసిన వారంతా.. ఈ కాంబో కనుక ఫిక్స్ అయితే మాత్రం ఇండస్ట్రీని షేక్ చేయడం ఖాయమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ‘పెద్ది’ షూటింగ్‌లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం వాస్తవానికి ఏప్రిల్ 30న విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, తాజా సమాచారం ప్రకారం.. జూన్ నెలకు వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. దీని తర్వాత చరణ్, సుకుమార్ దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ చేయనున్నారు.

Next Story