ఆకట్టుకుంటున్న ‘ప్రేమ విమానం’ ఫస్ట్ లుక్ పోస్టర్

by Chukka Sudharani |   (  Updated:2023-04-20 13:31:33  IST  )

ఫీల్ గుడ్ ఎంటర్టైనర్‌లో జీ5 & అభిషేక్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన వెబ్ ఫిల్మ్ ‘ప్రేమ విమానం’.

ఆకట్టుకుంటున్న ‘ప్రేమ విమానం’ ఫస్ట్ లుక్ పోస్టర్
X

దిశ, సినిమా : ఫీల్ గుడ్ ఎంటర్టైనర్‌లో జీ5 & అభిషేక్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన వెబ్ ఫిల్మ్ ‘ప్రేమ విమానం’. కాగా ఈ చిత్ర నిర్మాత అభిషేక్ నామా బర్త్ డే సందర్భంగా మూవీ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మేరకు సంగీత్ శోభన్, శాన్వీ మేఘన హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమాలోని ప్రధాన పాత్రధారులు దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా, వెన్నెల కిషోర్, అనసూయ భరద్వాజ్‌లను పోస్టర్‌లో పరిచయం చేశారు.

ఎలాగైనా విమానం ఎక్కాలని ప్రయత్నించే ఇద్దరు పిల్లలు, అర్జెంట్‌గా ఫ్లైట్ ఎక్కి తమ కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కోరుకునే ప్రేమ జంట. వీరి ప్రయాణంలో వచ్చే మలుపులు, సంతోషాలు, బాధలు, నవ్వులు అన్నీ ప్రేక్షకులను మెప్పించేలా ఉంటాయని దర్శకుడు సంతోష్ కటా తెలిపాడు. అనూప్ రూబెన్స్ సంగీతం.

Also Read..

‘రామబాణం’ ట్రైలర్ టైమ్ ఫిక్స్!

Next Story