- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నగ్నంగా ఉన్న టాలీవుడ్ హీరో ఫొటో షేర్ చేసిన సందీప్ రెడ్డి వంగా.. దుమారం రేపుతున్న పోస్ట్
సందీప్ రెడ్డి ఓ హీరో న్యూడ్ ఫొటోను షేర్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

దిశ, సినిమా: స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభాస్, త్రిప్తి డిమ్రి కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ సందీప్ రెడ్డి వంగా తన సోషల్ మీడియా యాక్టీవ్‌గా ఉంటూ నిత్యం పలు పోస్టులు షేర్ చేస్తున్నారు. తాజాగా ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ హీరో న్యూడ్ ఫొటోను షేర్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ పోస్టర్, చైతన్య రావు మదాడి (Chaitanya Rao Madadi)ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘దిల్ దియా’ (Dil Diya)సినిమాకు సంబంధించినదిగా తెలుస్తోంది. ‘ఏనెక్డ్ ట్రూత్’ అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌ను జోడిస్తూ, సినిమా ఫస్ట్ లుక్‌ను షేర్ చేశారు. పోస్టర్‌లో చైతన్య ఒంటిపై నూలు పోగు లేకుండా సోఫాపై కూర్చొని సీరియస్‌గా చూస్తున్నట్లు ఉన్నారు.
ఆయన లుక్ చాలా ఇంటెన్సివ్‌గా ఉంది. ఈ చిత్రానికి క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్‌లో ప్రత్యేకమైన కథాంశాలతో సినిమాలు తీసి గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఈ సినిమాకి కూడా ప్రత్యేక స్పెషల్ క్రేజ్ ఇచ్చేలా రూపొందిస్తున్నారు. పూర్ణ నాయుడు ప్రొడక్షన్, శ్రియాస్ చిత్రాస్ బ్యానర్లపై పూర్ణ నాయుడు నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ రా అండ్ రూటెడ్ ఎమోషనల్ డ్రామాను వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా థియేటర్స్‌లో విడుదల చేయాలని భావిస్తున్నారు. అయితే ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌నే ఆధారంగా చేసుకుని సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొందరు దీనిని ఆర్ట్‌లో భాగంగా చూస్తుంటే, మరికొందరు మాత్రం ఇలాంటి విజువల్స్‌తో సమాజాన్ని తప్పుదారి పట్టిస్తున్నారంటూ విమర్శలు చేస్తున్నారు. వంగా షేర్ చేసిన ఒక్క పోస్టర్‌తోనే ‘దిల్ దియా’ సినిమా ఇప్పటినుంచే హాట్ టాపిక్‌గా మారింది.






