సెన్సేషన్ డైరెక్టర్ వంగా స్ట్రాటజీ… ‘ధురంధర్’కి పోటీగా జపాన్ రిలీజ్

by Mallepaka Hamsa |   (  Updated:2025-12-25 07:41:42  IST  )

రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh)ప్రధాన పాత్రలో నటించిన ‘ధురంధర్’ (Dhurandhar)బాక్సాఫీసును షేక్ చేస్తూ రికార్డులు బద్దలు కొడుతోంది.

సెన్సేషన్ డైరెక్టర్ వంగా స్ట్రాటజీ… ‘ధురంధర్’కి పోటీగా జపాన్ రిలీజ్
X

దిశ, సినిమా: రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh)ప్రధాన పాత్రలో నటించిన ‘ధురంధర్’ (Dhurandhar)బాక్సాఫీసును షేక్ చేస్తూ రికార్డులు బద్దలు కొడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 935 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సంచలనం సృష్టిస్తూ దూసుకుపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ‘యానిమల్’ 915 కోట్లు రాబట్టి అత్యధివ వసూళ్లు సాధించిన 9వ భారతీయ చిత్రంగా నివగా.. దీని రికార్డును ‘ధురంధర్’ బ్రేక్ చేసింది. ఇక ఇప్పుడు దీనికి అడ్డుకట్ట వేసేందుకు సందీప్ రెడ్డి వంగా మాస్టర్ ప్లాన్ వేశారు ‘యానిమల్’ చిత్రాన్ని మరోసారి రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ సారి జపాన్‌లో మాత్రమే విడుదల కానున్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో జపాన్‌లో భారతీయ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తున్న విషయం తెలిసిందే. అందుకే సందీప్ రెడ్డి వంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది

బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘యానిమల్’ (Animal)రెండేళ్ల తర్వాత మళ్లీ థియేటర్స్‌లో సందడి చేయనుంది. ఈ విషయంపై మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ‘‘కోనో ఒటోకో వా డరేనిమో టోమెరెనై" (ఈ వ్యక్తిని ఎవరూ ఆపలేరు). అత్యంత చర్చనీయాంశమైన, వివాదాస్పదమైన, మరపురాని సినిమాటిక్ అనుభవం జపాన్‌కు రానుంది. యానిమల్ ఫిబ్రవరి 13, 2026న జపాన్ థియేటర్లలో విడుదల అవుతుంది’’ అనే క్యాప్షన్ జత చేస్తూ పోస్ట్ పెట్టారు. ఇక ‘ధురంధర్’ దక్కించుకున్న స్థానాన్ని ‘యానిమల్’ సొంతం చేసుకోవాలని చూస్తోంది. రూ. 1000 కోట్ల కలెక్షన్లు రాబట్టాలని సందీప్ రెడ్డి వంగా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. అది తెలుసుకున్న నెటిజన్లు సందీప్ రెడ్డి ప్లాన్ అదిరిపోయిందని కామెంట్స్ పెడుతున్నారు.

Next Story