ఎట్టకేలకు కొత్త ప్రాజెక్ట్‌.. ఓకే చెప్తూ సంతకం చేసిన సంయుక్త, షూటింగ్ ఎప్పుడంటే..

by Disha Web Desk 6 |
ఎట్టకేలకు కొత్త ప్రాజెక్ట్‌.. ఓకే చెప్తూ సంతకం చేసిన సంయుక్త, షూటింగ్ ఎప్పుడంటే..
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్‌ కెరియర్‌లో తెరకెక్కుతున్న 20వ చిత్రం ‘స్వయంభూ’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని పిక్సెల్ స్టూడియోస్‌ భువన్, శ్రీకర్.. పాన్ ఇండియా లెవెల్‌లో నిర్మిస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. నిఖిల్ క్రూరమైన యోధుడిగా కనిపించబోతున్న ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సంయుక్త స్క్రీన్‌ను పంచుకోనున్నట్లు తాజా సమాచారం. ‘విరూపాక్ష’, ‘సార్’ వంటి వరుస చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించిన సంయుక్త తన నటనా నైపుణ్యానికి గోల్డెన్‌లెగ్ అనే ట్యాగ్‌ని కూడా సంపాదించుకుంది. కాగా చాలా గ్యాప్ తర్వాత మరో కొత్త ప్రాజెక్ట్‌‌ను ఒకే చేయడంతో ఈ నెల18న సదరు మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.

Read More: Nikhil on Karthikeya 3: : త్వరలోనే కార్తికేయ-3.. క్లారిటీ ఇచ్చిన నిఖిల్


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed