- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంయుక్త మీనన్ ఉగ్రరూపం.. ‘ది బ్లాక్ గోల్డ్’ నుండి పవర్ ఫుల్ పోస్టర్ అవుట్!
నేడు (మార్చి 8) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చిత్ర బృందం ఈ సినిమా నుంచి సంయుక్తకు సంబంధించిన ఒక పవర్ ఫుల్ పోస్టర్‌ను విడుదల చేసింది.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ సంయుక్త మీనన్ (Samyuktha Menon)కెరీర్‌లో మరో కీలక అడుగు వేయబోతోంది. వరుస విజయాలతో ‘గోల్డెన్ లెగ్’గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు ఒక భారీ లేడీ ఓరియెంటెడ్ సినిమాతో తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది బ్లాక్ గోల్డ్’(The Black Gold). ఈ సినిమాలో సంయుక్త మునుపెన్నడూ చూడని విధంగా ఒక అత్యంత శక్తివంతమైన, నిర్భయమైన పాత్రలో కనిపించబోతోంది. నేడు (మార్చి 8) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చిత్ర బృందం ఈ సినిమా నుంచి సంయుక్తకు సంబంధించిన ఒక పవర్ ఫుల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ లుక్ చూస్తుంటే సంయుక్త ఈ సినిమా కోసం ఎంతగా కష్టపడిందో అర్థమవుతోంది.
చేతిలో గన్ పట్టుకుని, ఒళ్లంతా రక్తపు గాయాలతో ఉన్నప్పటికీ.. శత్రువులను చీల్చి చెండాడుతున్న ఆ ఉగ్రరూపం ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది. ఈ పోస్టర్‌కు ‘‘ఆయుధాల కంటే న్యాయాన్ని నమ్మే మహిళ’’ అనే క్యాప్షన్‌ను జత చేశారు. ఇది సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేసింది. యోగి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను హాస్య మూవీస్, మాగంటి పిక్చర్స్ సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ చిత్రానికి 'విక్రమ్ వేద' ఫేమ్ శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా, ప్రముఖ రచయిత రామజోగయ్య శాస్త్రి గారు సాహిత్యం సమకూరుస్తున్నారు. వీరందరి కలయికలో వస్తున్న ఈ ‘ది బ్లాక్ గోల్డ్’ సంయుక్త మీనన్ కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ సమ్మర్ కానుకగా విడుదల కాబోతుంది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, ఇలాంటి సాహసోపేతమైన పాత్రను ఎంచుకున్న సంయుక్తపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.






