- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Samantha: ట్రెండింగ్‌లో సమంత ఫ్యామిలీ ఫొటో.. నా హృదయం ఉప్పొంగుతుందంటూ ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. దర్శకుడు రాజ్ నిడిమోరు(Raj Nidimoru)తో రిలేషన్‌షిప్ కొనసాగించిన ఆమె డిసెంబర్ 1న పెళ్లి చేసుకుంది. కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లో ఈ ప్రేమికులు భార్యభర్తలుగా మారారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక రెండో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్న సమంత అత్త వారింట్లోకి వెళ్లింది. కుటుంబ సభ్యులంతా ఈ జంటకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పగా.. ఫ్యామిలీ ఫొటో కూడా తీసుకున్నారు. ఈ మేరకు రాజ్ సోదరి శీతల్ (Sheetal)ఈ ఫొటో షేర్ చేస్తూ ఎమోషనల్ అయింది. ఎప్పుడూ సమంతకు అండగా ఉంటామని చెప్పుకొచ్చింది. ‘‘నాకు ఆనందంతో మాటలు రావడం లేదు.
ఆనంద బాష్పాలతో నా హృదయం ఉప్పొంగుతుంది. నేటితో మా కుటుంబం పరిపూర్ణమైంది. సమంత-రాజ్ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతుండాలని కోరుకుంటున్నా. ఒకరిపై ఒకరికి గౌరవం, నిజాయతీతో రెండు హృదయాలు ఒకే మార్గాన్ని ఎంచుకున్నప్పుడు వారి జీవితం ప్రశాంతతో నిండిపోతుంది. మేము సమంతకు జీవితకాలం అండగా ఉంటాము’’ అని రాసుకొచ్చింది. అలాగే సమంత-రాజ్‌తో పాటు తన తల్లిదండ్రులు తన ముగ్గురు కొడుకులతో ఉన్న ఫొటోను షేర్ చేసింది. అయితే ఇందులో శీతల్ భర్త కనిపించకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ ఫొటోను సోషల్ మీడియాలో సమంత అభిమానులు వైరల్ చేస్తున్నారు. అలాగే ఓ ఇంటి దానివి అయినందుకు చాలా సంతోషంగా ఉందని అంటున్నారు.






