సమంత చేతికి అరుదైన రింగ్...ఎంగేజ్మెంట్ అయ్యిందా ?

by velandi.Saikiran |

టాలీవుడ్ ( Tollwood) స్టార్ హీరోయిన్ సమంత (Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 14 సంవత్సరాలుగా

సమంత చేతికి అరుదైన రింగ్...ఎంగేజ్మెంట్ అయ్యిందా  ?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ( Tollwood) స్టార్ హీరోయిన్ సమంత (Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 14 సంవత్సరాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీని... ఏలుతున్న సమంత గురించి తాజాగా ఓ సరికొత్త విషయం తెరపైకి వచ్చింది. ఆమె చేతికి ఉన్న రింగ్ (Ring) ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆమె పెట్టుకున్న రింగు గురించి సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఆమెకు ఇండస్ట్రీ కి సంబంధించిన ఓ వ్యక్తితో.. ఎంగేజ్మెంట్ జరిగిందని.. కామెంట్స్.. కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం.. సమంత నిర్మాతగా పనిచేసిన తొలి చిత్రం శుభం కు ( Shubham) సంబంధించిన.. ప్రమోషన్స్ కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే ఓ ఈవెంట్లో సమంత పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్న సమంత.... చాలా అందంగా మెరిశారు. దీంతో హీరోయిన్ సమంత ఫోటోలు ( Samantha Photos) సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ నేపథ్యంలోనే వైరల్ అయిన ఫోటోలపై రకరకాలుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. సమంత ముఖం చాలా అందంగా కొంతమంది కామెంట్స్ చేస్తుంటే.. ఆమె ధరించిన రింగు గురించి కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. ఆమెకి ఎంగేజ్మెంట్ అయిందని అందుకే రింగ్ ధరించిందని కొంతమంది అంటుంటే.. ఆ రింగు కేవలం ఫ్యాషన్ కోసం ధరించిందని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి సమంత ధరించిన రింగు మాత్రం హాట్ టాపిక్ అయింది. కాగా తాజాగా తిరుమలకు వెళ్లిన సమంత... అక్కడి నుంచి నేరుగా శ్రీకాళహస్తికి వెళ్ళింది. శ్రీకాళహస్తిలో రాహు కేతువు పూజలు కూడా చేసుకుందట సమంత.

Next Story