సమంతపై మనోజ్ బాజ్‌పాయ్ సంచలన వ్యాఖ్యలు.. అందుకు సమంత ఏమందంటే..?

by Dishafeatures2 |
సమంతపై మనోజ్ బాజ్‌పాయ్ సంచలన వ్యాఖ్యలు.. అందుకు సమంత ఏమందంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: భర్త అక్కినేని నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న దగ్గర నుంచి నిత్యం ఏదో ఒక రకంగా సమంత సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ సమంతపై కీలక వ్యాఖ్యలు చేయగా అందుకు సమంత రిప్లై ఇచ్చింది. సమంత కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మనోజ్ బాజ్‌పాయ్ తో కలిసి సమంత ఫ్యామిలీ మ్యాన్ 2 అనే వెబ్ సెరీస్ లో నటించింది. ఈ సినిమాలో రాజీ అనే టెర్రరిస్ట్ పాత్రలో సమంత మెప్పించింది. టెర్రరిస్ట్ పాత్ర కోసం సమంత ట్రైనింగ్ కూడా తీసుకుంది. ప్రస్తుతం సమంత మయోసిటిస్ అనే వ్యాధితో బాధపడుతోంది. ఈ క్రమంలోనే ఫ్యామిలీ మ్యాన్ 2 లో ఆమెతో నటించిన మనోజ్ బాజ్‌పాయ్ సమంతపై కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు.

త్వరలో రిలీజ్ కానున్న తన ''గుల్ మొహర్'' సినిమా ప్రమోషన్ లో భాగంగా మనోజ్ బాజ్‌పాయ్ మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలోనే కొంతమంది జర్నలిస్ట్ లు ఆయన్ని సమంత గురించి ఏదైనా చెప్పమని అడిగారు. అందుకు ఆయన బదులిస్తూ '' సమంత చాలా హార్డ్ వర్కింగ్. ఫ్యామిలీ మ్యాన్ సెట్ లో ఆమె పడుతున్న ఫిజికల్ కష్టాన్ని చూసి నాకు భయమేసింది. క్యారెక్టర్ కు న్యాయం చేయడం కోసం తనను తాను బాగా కష్టపెట్టుకునేది'' అని చెప్పారు. తాజాగా సమంతపై ఆయన చేసిన కామెంట్స్ కు సంబంధించిన వీడియోను సమంత ఫ్యాన్ ఒకరూ ట్విట్టర్ లో షేర్ చేశారు. అందుకు స్పందించిన సమంత.. హగ్, హార్ట్ షేప్డ్ ఎమోజీలు షేర్ చేసి 'ట్రై చేస్తా సార్' అంటూ కామెంట్ పెట్టింది.

ఇవి కూడా చదవండి: ఇద్దరిని ప్రేమించి మోసపోయిన సింగర్.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్

Next Story

Most Viewed