విజయ్ దేవరకొండ పై ఉన్న ప్రేమను బయట పెట్టిన సమంత

by Disha Web Desk 5 |
విజయ్ దేవరకొండ పై ఉన్న ప్రేమను బయట పెట్టిన సమంత
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక విడాకుల తర్వాత సమంత చాలా కుంగిపోయింది. ఆ తర్వాత మయోసిటిస్, వ్యాధి భారిన చాలా రోజులు మానసికంగా చాలా సమస్యలు ఎదుర్కొంది . అయితే ఈమెకు అన్నివేళలా విజయ్ దేవరకొండ సపోర్ట్ గా నిలిచారట. ఇక సమంత విజయ్ దేవరకొండ కలిసి ఖుషి అనే సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమాకి శివ నిర్మాణ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా సమంత విజయ్ దేవరకొండ మీద ఉన్న ప్రేమని పోస్ట్ రూపంలో బయటపెట్టింది. ఆమె చేసిన పోస్టులో.. ఈ సంవత్సరం మీతో చాలా బాగా గడిచింది. నవ్వును చూశారు.. మీ బెస్ట్ ని కూడా చూశారు. అలాగే మీ ఎదుగుదలను పతనాన్ని రెండింటిని చూశారు. మీతో ఈ ఏడాది చాలా బాగుంది విజయ్ దేవరకొండ అంటూ సమంత విజయ్ దేవరకొండ తో ఉన్న అనుబంధాన్ని,ప్రేమని ఒక పోస్ట్ రూపంలో బయటపెట్టి వైట్ కలర్ లవ్ సింబల్ పెట్టి సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.

Also Read..

విజయ్ దేవరకొండ పర్సనల్ లైఫ్‌పై సమంత పోస్ట్ వైరల్

Next Story

Most Viewed