- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Samantha: రాజ్ నిడిమేరుతో రిలేషన్ షిప్‌పై స్పందించిన సమంత.. షాకింగ్ పోస్ట్‌తో డైరెక్టర్ భార్యకు స్ట్రాంగ్ కౌంటర్!
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత(samantha) గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత(samantha) గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. మయోసైటీస్ బారిన పడటంతో మొత్తానికి ఇండస్ట్రీకి దూరం అయి ఆ వ్యాధి నుంచి బయటపడింది. ఆ తర్వాత నిర్మాతగా మారిన ఆమె ట్రాలాలా బ్యానర్ స్థాపించి మొదటి మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. ‘శుభం’ (shubham)పేరుతో వచ్చిన ఈ సినిమా మే 9న థియేటర్స్‌లో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే.. సమంత పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఈ అమ్మడు గత కొద్ది రోజుల నుంచి ‘సీటాడెల్: హనీ బన్నీ’(Citadel: Honey Bunny) తెరకెక్కించిన డైరెక్టర్ రాజ్ నిడిమోరు(Raj Nidimoru)తో సీక్రెట్‌గా రిలేషన్‌లో ఉన్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే సామ్ అతడితో క్లోజ్‌గా ఉన్న ఫొటోలు షేర్ చేయడంతో ఆ వార్తలకు బలం చేకూరినట్లు అయింది. సమంత, రాజ్ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ పలు పుకార్లు షికారు చేస్తున్నాయి.
ఇక ఈ విషయంపై రాజ్ నిడిమోరు భార్య కూడా పలు పోస్టులు షేర్ చేయడంతో వీరి రిలేషన్‌షిప్‌పై అంతా విమర్శలు చేయడం మొదలుపెట్టారు. భార్య, పిల్లలు ఉన్నవాడితో సమంత రిలేషన్‌లో ఉండటం ఏంటని అంతా ట్రోల్ చేశారు. ఇక ఇన్నాళ్లకు సమంత రాజ్ నిడిమోరుతో రిలేషన్‌షిప్‌పై ఇండైరెక్ట్‌గా ఓ కొటేషన్ షేర్ చేసి ఆయన భార్యకు స్ట్రాంగ్ కౌంటర్ వేసింది. ‘‘ఎప్పుడూ నిశ్చబ్దంగా ఒకరిని మెచ్చుకోవద్దు. నేను ఎవరినైనా ఆరాధిస్తే ఖచ్చితంగా నేను వారికి చెబుతాను. మనం మనుషులం చాలా పెళుసుగా ఉంటాము. ప్రజలు ఇక్కడ ఉన్నప్పుడే వారితో కలవడం నేర్చుకోవాలి. ఎప్పుడూ నిశ్శబ్దంగా ఒకరిని ఆరాధించకండి’’ అని రాసుకొచ్చింది. ఇక ఈ కొటేషన్ చూసిన నెటిజన్లు రాజ్ భార్యను ఉద్దేశించే పెట్టిందని అంటున్నారు. అలాగే రాజ్‌నిడిమోరును ఆరాధిస్తున్నట్లు ఇండైరెక్ట్‌గా చెప్పిందని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.






