తన న్యూడ్ ఫోటో పై స్పందించిన సమంత.. అసలు నిజం ఇదే అంటూ పోస్ట్!

by Disha Web Desk 8 |
తన న్యూడ్ ఫోటో పై స్పందించిన సమంత.. అసలు నిజం ఇదే అంటూ పోస్ట్!
X

దిశ, సినిమా : ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మార్ఫింగ్ ఫోటోపై నెట్టింట తెగ చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. సమంత మయోసైటీస్ వ్యాధి బారిన పడి సంవత్సర కాలం పాటు ఆమె సినిమాలకు బ్రేక్ ఇచ్చి, ఇప్పుడిప్పుడే ఆ సమస్య నుంచి బయటపడి మళ్లీ వెండితెరకు రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆమె మయోసైటీస్ వ్యాధి బారిన పడినప్పటి నుంచి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ..తన అభిమానులతో ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటుంది. ఈ క్రమంలోనే సామ్ మ‌యోసైటిస్ నుంచి కోలుకుంటున్న స‌మంత త‌న‌కు జ‌రిగిన చికిత్స గురించి ప్రజలకు ఎడ్యుకేట్ చేస్తూ.. ఫార్ ఇన్‌ఫ్రారెడ్ సౌనా అనే వైద్య విధానం, అధునాత‌న‌ సాంకేతిక‌త‌తో ఆరోగ్యంగా ఉండటానికి, కండరాలు బలగా తయారు అవ్వడానికి , అలానే శరీరంలో కొవ్వు తగ్గి, కండ పుష్టి కరిగించి శరీరానికి పునర్ జీవింపజేసే ప్రక్రియ గురించి ఆమె వివరించారు. ఈ క్రమంలో సమంత బాత్ టవల్‌తో ఉన్న ఫొటోను షేర్ చేసింది. ఇక దీన్ని కొందరు మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

దీంతో సమంత న్యూడ్ ఫోటోపై ఆమె అభిమానులు మండిపడుతున్నారు. సామ్ అలాంటి ఫోటో షేర్ చేయలేరని, కావాలనే ఎవరో ఫేక్ ఫోటో క్రియేట్ చేశారంటూ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సమంత చేసిన పోస్ట్ చర్చనీయాంశం అవుతుంది. ఆమె తన ఇన్ స్టాలో ఓ కోట్ షేర్ చేసింది. మిమ్మల్ని మీరు సమర్థించుకోవడం లేదా నిరూపించుకోవాల్సిన అవసరం లేకుండా జీవించగలగడమే నిజమైన విజయం అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం సామ్ షేర్ చేసిన ఈ కొటేషన్ వైరల్ కాగా, సమంత అర్ధనగ్న ఫొటోపై ప్రచారానికి ఫుల్‌స్టాప్‌ పెట్టడానికి ఈ కోట్ షేర్ చేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

Next Story

Most Viewed