- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, సినిమా: మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి కారణంగా కొంతకాలంగా మంచానికే పరిమితమైంది సమంత. అయితే సోషల్ మీడియా వేదికగా అభిమానులకు ఎల్లప్పుడూ దగ్గరగానే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా పూజ గదిలో లింగ భైరవి దేవి అమ్మ వారికి పూజ చేస్తున్న ఫొటోను నెట్టింట షేర్ చేసింది. అంతేకాదు దీనికి ‘జీవితంలో నమ్మకమే ప్రధానమైన బలం. విశ్వాసమే మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతుంది. నమ్మకమే మీ గురువు. నమ్మకమే మిమ్మల్ని మానవాతీతంగా చేస్తుంది’ అని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న పిక్‌పై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఆమె క్రిస్టియన్ కదా? హిందూ మతంలోకి ఎప్పుడు వచ్చింది? అసలు సమంత ఏ మతానికి చెందిన వ్యక్తి? అంటూ రకరకాల ప్రశ్నలతో నెటిజన్లు నెట్టింట భారీ చర్చకు దిగారు.
Next Story






