- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెరగని ముద్రలు..ఇంకా నాగచైతన్య వెంటపడుతున్న సమంత.. ఇదిగో ఇదే సాక్ష్యం!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ( Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 15 సంవత్సరాలుగా టాలీవుడ్

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ( Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 15 సంవత్సరాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీని సమంత ఏలుతోంది. అయితే అలాంటి సమంత గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త చెక్కర్లు కొడుతోంది. అక్కినేని నాగచైతన్యను (Akkineni Nagachaitanya ) ఇంకా సమంత మర్చిపోలేదని... ఇంకా అతన్ని ప్రేమిస్తోందని చర్చ మరోసారి పైకి వచ్చింది. దీనికి కారణం... ఆమె ప్రైవేట్ పార్ట్ పై ఉన్న టాటూ ( Tatoo) అని తెలుస్తోంది.
ముంబైలో జిమ్ కు వెళ్లిన సమంత... ఫోటోగ్రాఫర్లపై తాజాగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పదే పదే ఫోటోలు తీయకూడదని... కోరినప్పటికీ.. ఫోటోగ్రాఫర్లు కాస్త ఓవర్ చేశారు. దీంతో ఆమె అసహనం వ్యక్తం చేస్తూ.. కారు ఎక్కి వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలోనే... హీరోయిన్ సమంతకు సంబంధించిన వీడియో అలాగే ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇందులో ఆమె ప్రవేట్ పార్ట్ పైన ఉన్న టాటూ... స్పష్టంగా కనిపించింది.
YMC అనే టాటూ... ఇప్పుడు వైరల్ గా మారింది.YMC అంటే ఏం మాయ చేసావే అని అర్థం. హీరో అక్కినేని నాగచైతన్య అలాగే సమంత ఇద్దరు కలిసి తీసిన మొదటి సినిమా ఇదే. ఆ సినిమా సందర్భంగా నే హీరోయిన్ సమంత , నాగచైతన్య ఇద్దరు ప్రేమలో పడ్డారు. దానికి గుర్తుగానే ఆమె ఈ టాటూ వేయించుకుంది. అయితే విడాకులు ఇచ్చినప్పటికీ కూడా ఆ టాటూ మాత్రం తొలగించలేదు సమంత. దుబాయ్ కి వెళ్ళినప్పుడు సమంత అ టాటూ తొలగించిందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ టాటూ మళ్లీ దర్శనమిచ్చింది.. దీంతో నాగచైతన్య ను సమంత మర్చిపోవడంలేదని కామెంట్ చేస్తున్నారు.






