రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలో సమంత.. బాక్సాఫీసు షేక్ అవడం ఖాయం?

by Mallepaka Hamsa |

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘పెద్ది’(Peddi).

రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలో సమంత.. బాక్సాఫీసు షేక్ అవడం ఖాయం?
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘పెద్ది’(Peddi). ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తుండగా.. శివ రాజ్ కుమార్, దివ్యేందు శర్మ జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, గ్లింప్స్ విడుదలై అంచనాలను పెంచడంతో సినీ ప్రియులంతా ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూడా ఉన్నట్లు పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి.

ఇందులో స్టార్ బ్యూటీ సమంత ఐటమ్ సాంగ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ అమ్మడు ‘పుష్ప’లో ‘ఊ అంటావా మావా ఊహు అంటావా’ సాంగ్‌తో ప్రపంచవ్యాప్తంగా ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఇప్పుడు మరోసారి అలాంటి సాంగ్‌లోనే గ్లోబల్ స్టార్ సరసన అదిరిపోయే స్టెప్పులు వేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే రామ్ చరణ్, సమంత కాంబోలో వచ్చిన ‘రంగస్థలం’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి బిగ్‌స్క్రీన్‌పై ఈ హిట్ జంట కనిపించనుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు మరోసారి బాక్సాఫీసు షేక్ అవడం ఖాయమని అభిప్రాయ పడుతున్నారు.


Next Story