- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సమంతకు మరో ఆఫర్..ఇక థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే!
సమంతకు మరో ఆఫర్..ఇక థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే!

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దాదాపు 15 సంవత్సరాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీని దున్నేస్తున్నారు హీరోయిన్ సమంత. అయితే ఈ మధ్యకాలంలో.. సినిమాలు పెద్దగా చేయని హీరోయిన్ సమంతకు ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్లు చెబుతున్నారు. హీరోయిన్ సమంతకు లేడీ ఓరియంటెడ్ ఆఫర్ వచ్చిందట.
టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఓ ప్రముఖ దర్శకుడు... హీరోయిన్ సమంతతో ఈ లేడి ఓరియంటెడ్ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు 100 కోట్లతో.. ఈ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా మొత్తం క్రైమ్ ఓరియంటెడ్ అని సమాచారం అందుతుంది. యశోద సినిమా తరహాలోనే ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. దీంతో వెంటనే సమంత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు.
ఇది ఇలా ఉండగా.. నాగచైతన్య కి విడాకులు ఇచ్చిన తర్వాత కూడా... హీరోయిన్ సమంత క్రేజ్ ఎక్కడ తగ్గలేదు. సమంతకు మరింత ఫ్యాన్స్ పెరిగిపోయారు తప్ప తగ్గలేదు. అక్కినేని ఫ్యామిలీ విషయంలో.. హీరోయిన్ సమంతనే నలిగిపోయిందని.. ఫ్యాన్స్ అంటున్నారు. ఇక ఇటీవల హీరోయిన్ సమంత శుభం సినిమాతో నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో సమంత కూడా కనిపించారు.






