- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Samantha: సమంతకు చేదు అనుభవం.. షాకింగ్ వీడియో వైరల్.. నెటిజన్లు ఫుల్ ఫైర్
ఇటీవల అభిమానుల ప్రవర్తన తీరు సెలబ్రిటీల్లో భయాందోళనకు గురి చేస్తోంది.

దిశ, సినిమా: ఇటీవల అభిమానుల ప్రవర్తన తీరు సెలబ్రిటీల్లో భయాందోళనకు గురి చేస్తోంది. ఒకరి తర్వాత ఒకరు అభిమానుల అత్యుత్సాహం వల్ల హీరోయిన్లు ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల ‘ది రాజాసాబ్’ నిధి అగర్వాల్(Nidhi Agarwal)పై లూలూ మాల్‌లో కొందరు అసభ్యంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. ఈ సంఘటన మరువకముందే ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆమె మరెవరో కాదు.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha). ఓ ప్రముఖ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరైన సామ్ ఈవెంట్ పూర్తయ్యాక బయటకు వెళ్లే సమయంలో అభిమానుల గుంపు ఒక్కసారిగా ఆమె చుట్టూ చేరింది. సెల్ఫీల కోసం సమంతను తాకేందుకు ప్రయత్నించారు. ఇక అది గమనించిన సెక్యూరిటీ వాళ్లను ఆపే ప్రయత్నం చేశారు. తన పర్సనల్ సెక్యూరిటీతో చాలా ఇబ్బంది పడుతూ బయటకు వచ్చేసింది.
ఈక్రమంలోనే.. ఆమె చీరను ఎవరో తొక్కడంతో.. సమంత కింద పడుతుండగా.. చివరి నిమిషంలో సెక్యూరిటీ సాయంతో కారు వద్దకి వెళ్లింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోలు చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. స్టార్ హీరోయిన్‌కు ఇలాంటి అనుభవం ఎదురవడం దారుణం అంటూ మండిపడుతున్నారు. మొన్న నిధికి, ఈరోజు సమంత ఇలా జరగడానికి కారణం కార్యక్రమా నిర్వాహకులను తిడుతున్నారు. హీరోయిన్లను పిలిచినప్పుడు వాళ్లని భద్రంగా చూసుకోవాల్సిన బాధ్య నిర్వాహకుల మీద ఉంటుందని.. కానీ వాళ్లు సెక్యూరిటీని పెంచకపోవడం వల్లే హీరోయిన్లను రక్షణ లేకుండా పోతుందని అంటున్నారు. ప్రస్తుతం నిధి, సమంత సంఘటనలు సోషల్ మీడియాతో హాట్ టాపిక్‌గా మారాయి. ఇలాంటి కార్యక్రమాలు హాజరైనప్పుడు హీరోయిన్లు అయినా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. కాగా.. సమంత డిసెంబర్ 1న తన ప్రియుడు రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లై నెలరోజులు కూడా కాకముందే సామ్ బ్యాక్ టూ వర్క్ అంటూ షూటింగ్స్, యాడ్స్ చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది.






