మెగా హీరో సినిమాలో సమంత ఛాన్స్... ఇక థియేటర్లు బద్దలే!

by velandi.Saikiran |

అలాంటి హీరోయిన్ సమంత ఇటీవల నిర్మాతగా అవతారం కూడా ఎత్తింది. ఇక ఇప్పుడు హీరోయిన్ సమంతకు మరో స్పెషల్

మెగా హీరో సినిమాలో సమంత ఛాన్స్... ఇక థియేటర్లు బద్దలే!
X

దిశ‌, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ.. హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ సమంత... ఇప్పటికి కూడా ఇండస్ట్రీని వెళ్తున్నారు. మధ్యలో అక్కినేని నాగచైతన్య తో పెళ్లి ఆ తర్వాత విడాకులు తీసుకుంటూ తీసుకున్నప్పటికీ.. సమంత క్రేజ్ ఎక్కడ కూడా తగ్గలేదు. విడాకులు అనంతరం పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి జనాలందరికీ దగ్గర అయింది.

అలాంటి హీరోయిన్ సమంత ఇటీవల నిర్మాతగా అవతారం కూడా ఎత్తింది. ఇక ఇప్పుడు హీరోయిన్ సమంతకు మరో స్పెషల్ రోల్ వచ్చిందట. అట్లీ అలాగే అల్లు అర్జున్ చేస్తున్న AA22 సినిమాలో.. హీరోయిన్ సమంతకు స్పెషల్ రోల్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఓ స్పెషల్ రోల్ కోసం సమంతాను ఫిక్స్ చేసిందట చిత్ర బృందం. ఈ మేరకు సమంతతో కూడా చర్చలు జరిగినట్లు చెబుతున్నారు. దాదాపు మూడు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకొని ఈ రోల్ చేసేందుకు సమంత కూడా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

Next Story