సీక్రెట్‌గా అమెరికా చెక్కేసిన సమంత.. ఆ ఆపరేషన్ కోసమేనట!

by Disha Web Desk 19 |
సీక్రెట్‌గా అమెరికా చెక్కేసిన సమంత.. ఆ ఆపరేషన్ కోసమేనట!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, నాగచైతన్యతో విడాకులు తీసుకున్న దగ్గరి నుండి నిత్యం ఏదో టాపిక్‌తో వార్తల్లో నిలుస్తోంది. సామ్‌కు సంబంధించిన ఏ వార్త అయినా క్షణాల్లో ఇట్టే వైరల్ అవుతోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో సైతం తెగా యాక్టివ్‌గా ఉండే ఈ హాట్ బ్యూటీ తనకు సంబంధించిన అప్డేట్స్‌ను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటుంది. అయితే, ఇటీవల కాలంలో ఈ భామ సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉంటుంది. దీనికి కారణం సమంత స్కిన్ ప్రాబ్లమ్‌తో బాధపడుతోందంట.. అందుకే ఈ అమ్మడు సోషల్ మీడియాకు దూరమైందని వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి.

అంతేకాకుండా ఈ స్కిన్ ప్రాబ్లమ్‌కి సర్జరీ చేయించుకునేందుకు సామ్ అమెరికా వెళ్లేందుకు సిద్ధమైందని వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ విషయాన్ని చాలా సీక్రెట్ ఉంచుతున్నారని.. అందుకే ఈ హాట్ బ్యూటీ ఇటీవల సినిమా షూటింగ్‌లకు వెళ్లకుండా సోషల్ మీడియాకు దూరంగా ఉంటుందని సమాచారం. సర్జరీ చేయించుకోవడంతో సామ్‌కు డాక్లర్లు బెడ్ రెస్ట్ ఇచ్చారని.. కొన్ని రోజుల తర్వాత తిరిగి మళ్లీ సామ్ సినిమా షూటింగ్‌లకు హాజరు అవుతోందని సినీ సర్కిల్స్ జోరుగా ప్రచారం జరుగుతోంది.

Also Read : ముక్కుపుడక గాయం 'ప్లాస్టిక్ చోప్రా'గా మార్చేసింది.. ప్రియాంక



Next Story

Most Viewed