సల్మాన్ సోదరి ఇంట్లో చోరీ.. వజ్రాలతో చేసిన అభరణాలు మాయం

by Prasanna |
సల్మాన్ సోదరి ఇంట్లో చోరీ.. వజ్రాలతో చేసిన అభరణాలు మాయం
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చెల్లెలు, అర్పిత ఖాన్ ఇంట్లో చోరీ జరిగింది. వజ్రాలతో చేసిన చెవిపోగులు, తన మేకప్ ట్రేలో పెట్టగా మాయమైనట్లు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాటి విలువ రూ.5 లక్షలకు పైనే ఉంటుందని చెప్పింది. కాగా పోలీసులు విచారణ జరిపి అది ఇంటి దొంగల పనే అని తేల్చారు. అర్పితా ఖాన్ ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తిని అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. అర్పిత ఇంట్లో దాదాపు 30 ఏళ్లుగా పనిచేస్తున్న సందీప్ హెగ్డే ఈ పని చేసినట్లు గుర్తించారు పోలీసులు. ఈ క్రమంలో సందీప్ నుంచి చెవి పోగులు రికవరీ చేసి, అతనిపై సెక్షన్ 381 కింద కేసు నమోదు చేశారు.

Next Story

Most Viewed