- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Salman Khan: సెలబ్రిటీల విడాకులపై సల్మాన్ ఖాన్ సెన్సేషనల్ కామెంట్స్.. దుమారం రేపుతున్న వీడియో
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. గత ఏడాది ‘సికందర్’(Sikander) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన భారీ డిజాస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఓ బయోపిక్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఆయన పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. సల్మాన్ ఖాన్ 59 ఏళ్లు వచ్చినప్పటికీ పెళ్లి చేసుకోకుండా స్టిల్ బ్యాచ్‌లర్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. కొంతమందితో రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పటికీ పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా, సల్మాన్ ఖాన్ కపిల్ శర్మ(Kapil Sharma) షోలో భాగంగా సెలబ్రిటీల విడాకులకుపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
ఈ షోకు ఆయన బీయింగ్ హ్యూమన్ టీషర్ట్‌లో కూల్ లుక్‌లో కనిపించాడు. కానీ విడుదలపై తనదైన స్టైల్లో కామెంట్స్ చేసి ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు. ‘‘మునపటిలా సంబంధాలు ఉండండం లేదు. ఒకరి కోసం మరొకరు త్యాగాలు చేసే రోజులు ఇప్పుడు పోయాయి. అప్పట్లో ఆడవాళ్లు సహనంతో ఉండేది. కానీ ఇప్పుడు ఎవరూ కూడా అలా సహనంతో లేరు. రాత్రి ఒకరి కాలు మరొకరి మీద పడిందన్నా, కొంచెం గురక పెట్టారన్నా చాలు. ఇక అంతే విడాకులు తీసుకోవడానికి రెడీ అయిపోతున్నారు. అతి చిన్న కారణాలకే విడాకులు తీసుకుని విడిపోతున్నారు. అంతే కాదు, విడాకుల తర్వాత ఆడవాళ్లు సగం డబ్బు కూడా భరణంగా తీసుకెళ్లి పోతున్నారు’’ అని చెప్పుకొచ్చారు.
ఆయన కామెడీగా తన అభిప్రాయం చెప్పినప్పటికీ ప్రస్తుతం ఆయనకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ఇక అది చూసిన పలువురు మాత్రం ఆయనను ట్రోల్స్ చేస్తుంటే.. మరికొందరు నెటిజన్లు మీరు చెప్పింది 100శాతం నిజమని సపోర్ట్‌గా నిలుస్తున్నారు. కాగా, గత కొద్ది కాలంగా సినీ ఇండస్ట్రీలో విడాకులు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా సాధారణ జనాలు కూడా చిన్న కారణాలతో విడిపోతున్నారు. ఇక సినీ సెలబ్రిటీల గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు కూడా పిల్లలు పుట్టిన తర్వాత ఏం మాత్రం ఆలోచించకుండా మనస్పర్ధలతో విడిపోతున్నారు.






