- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’ విడుదల వాయిదా?
ఈ సినిమా విడుదల అనుకున్న సమయానికి కాకుండా, ఏకంగా 2027వ సంవత్సరానికి వాయిదా పడినట్లు తెలుస్తోంది.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, చిత్రాంగద సింగ్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాతృభూమి’. దర్శకుడు అపూర్వ లఖియా దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో, సల్మాన్ ఖాన్ కల్నల్ సంతోష్ బాబు పాత్రను పోషిస్తున్నారు. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు మొదట ‘బాటిల్ ఆఫ్ గాల్వా్న్’ అని టైటిల్ పెట్టినప్పటికీ వివాదాలకు తావివ్వకుండా ఎలాంటి దేశం పేరు ప్రస్తావించకుండా ‘మాతృభూమి’గా మార్చారు మూవీ మేకర్స్. అయితే ఈ సినిమా సెన్సార్ బోర్డు క్లియరెన్స్ సమస్యల కారణంగా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ పలు కారణాలతో నిత్యం వాయిదా పడుతూ వస్తుండటంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా, ‘మాతృభూమి’ విడుదలపై క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా విడుదల అనుకున్న సమయానికి కాకుండా, ఏకంగా 2027వ సంవత్సరానికి వాయిదా పడినట్లు తెలుస్తోంది.
చిత్ర కథాంశం, అలాగే సినిమాలో చైనాకు సంబంధించిన కొన్ని సున్నితమైన ప్రస్తావనలపై దేశ రక్షణ మంత్రిత్వ శాఖ కొన్ని ఆందోళనలు, అభ్యంతరాలు వ్యక్తం చేయడమే ఈ ఆలస్యానికి ప్రధాన కారణమని సమాచారం. అయితే సినిమాలోని వివాదాస్పద అంశాలు, రక్షణ మంత్రిత్వ శాఖ లేవనెత్తిన సమస్యలు త్వరలోనే పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తున్నప్పటికీ, ప్రస్తుత 2026వ సంవత్సరంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్‌కు ఒక మంచి డేట్ దొరకడం కష్టంగా మారింది. ఎందుకంటే 2026లో పెద్ద పెద్ద విడుదల తేదీలన్నీ అప్పటికే వేరే పెద్ద సినిమాలతో నిండిపోయాయి. అయితే, ఒకవేళ అనుకున్న సమయానికి సమస్యలన్నీ పూర్తిగా సకాలంలో పరిష్కారమైతే మాత్రం..అక్టోబర్ 20న వచ్చే ఐదు రోజుల లాంగ్ వీకెండ్ సెలవులను ఉపయోగించుకుని సినిమాను థియేటర్లలోకి తీసుకువచ్చే అవకాశం ఉందని టాక్. లేదంటే వచ్చే ఏడాది విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.






