- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ది ఫ్యామిలీ మ్యాన్’ మేకర్స్‌తో సల్మాన్ ఖాన్ భారీ ప్రాజెక్ట్.. హాట్ టాపిక్‌గా మారిన పోస్ట్
ది ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ వంటి బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్‌లతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న క్రేజీ డైరెక్టర్స్ ద్వయం రాజ్ అండ్ డికే దర్శకత్వంలో సల్మాన్ ఒక సినిమా చేయబోతున్నట్లు సమాచారం.

దిశ, సినిమా: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకవైపు ‘మాతృభూమి’ షూటింగ్‌లో పాల్గొంటూనే, మరోవైపు టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లితో ఒక భారీ యాక్షన్ డ్రామాను పట్టాలెక్కించారు. తాజాగా, ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా ఘనంగా ముగిశాయి. అయితే, ఇప్పుడు సల్మాన్ ఖాన్ అభిమానులకు మరో అదిరిపోయే వార్త వినిపిస్తోంది. సల్మాన్ త్వరలోనే ఒక విభిన్నమైన యాక్షన్ ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ వంటి బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్‌లతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న క్రేజీ డైరెక్టర్స్ ద్వయం రాజ్ అండ్ డికే దర్శకత్వంలో సల్మాన్ ఒక సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఈ భారీ బడ్జెట్ చిత్రం 2026 అక్టోబర్‌లో ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇది ఒక హై-కాన్సెప్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని, ఇందులో సల్మాన్ ఖాన్ మునుపెన్నడూ చూడని ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది.
ఈ సినిమా కథ విభిన్నంగా ఉండబోతోందని టాక్. హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ నటించిన ‘హ్యాంకాక్’ తరహాలో, సూపర్ హీరో ఎలిమెంట్స్‌కు కాస్త కామెడీని జోడించి రాజ్ అండ్ డికే ఈ కథను సిద్ధం చేశారట. ఒక శక్తివంతమైన వ్యక్తి సమాజంలో తనదైన శైలిలో ఎలా ఉంటాడు అనే కోణంలో ఈ సినిమా సాగనుందట. అతుల్ అగ్నిహోత్రి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఈ భారీ ప్రాజెక్ట్‌లో భాగం కాబోతున్నట్లు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ మార్క్ మాస్ ఎలిమెంట్స్ కి, రాజ్ అండ్ డికే మార్క్ మేకింగ్ తోడైతే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ లో ఉండటంతో సౌత్ లో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.






