లైవ్‌ షోలో సిగరెట్ తాగిన సల్మాన్ ఖాన్.. నెటిజన్స్ ఫైర్ ( వీడియో)

by Disha Web Desk 6 |
లైవ్‌ షోలో సిగరెట్ తాగిన సల్మాన్ ఖాన్.. నెటిజన్స్ ఫైర్ ( వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం టైగర్-3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అలాగే బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్‌బాస్ షోకు హోస్ట్‌గా కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే శనివారం ప్రసారమైన ఈ సీజన్ వీకెండ్ ఎపిసోడ్‌లో సల్మాన్ ఖాన్ చేతిలో సిగరెట్ పట్టుకుని కనిపించాడు. అసలు ఏం జరిగిందంటే.. సాధార‌ణంగా హోస్ట్ కంటెస్టెంట్స్‌కు బిగ్ బాస్ హౌస్‌లో ఎలా ప్రవ‌ర్తించార‌నే దానిపై విశ్లేష‌ణ చేస్తారు. అయితే అలా చేస్తున్న సమయంలో ఓ సంద‌ర్భంలో స‌ల్మాన్ ఖాన్ చేతిలో సిగ‌రెట్ క‌నిపించింది. దీంతో అది చూసిన నెటిజ‌న్స్‌.. మీరు ఎంతో మందికి స్ఫూర్తి.. అలాంటి వ్యక్తి కెమెరా ముందు ఇలాంటి పనులు చేయకూడదని తెలియదా అంటూ ఫైర్ అవుతున్నారు. అంతేకాకుండా ధూమపానం మంచిది కాదని మీరు ఇతరులకు చెప్పాల్సింది పోయి ఇలా చేయడమేంటి? అని ప్రశ్నిస్తున్నారు. ఇక దీనిపై సల్లూ భాయ్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

Also Read: జోరు వర్షంలో షాహిద్, కరీనా పాటకు స్టెప్పులేసిన జంట.. వీడియో వైరల్..

Next Story

Most Viewed