నీ కుప్పి గెంతులు చూసి జనాలు నవ్వుకుంటున్నారు.. సల్మాన్‌పై ట్రోలింగ్

by Disha Web Desk 9 |
నీ కుప్పి గెంతులు చూసి జనాలు నవ్వుకుంటున్నారు.. సల్మాన్‌పై ట్రోలింగ్
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మరోసారి నెట్టింట దారుణమైన ట్రోలింగ్‌కు గురవుతున్నాడు. ఆయన నటించిన ‘కిసీ కా భాయ్‌ కిసీ కి జాన్‌’ మూవీ ఏప్రిల్ 21న విడుదలకానుండగా జోరుగా ప్రమోషన్స్‌ జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పలు అప్‌డేట్స్ ఇస్తున్న మేకర్స్ ఇటీవల ఓ సాంగ్‌ విడుదల చేయగా అందులో తెల్ల లుంగీ కట్టుకుని సల్మాన్ చేసిన డ్యాన్స్ హాస్యాస్పదమైంది.

లుంగీకి, ధోతికి తేడా లేకుండా హీరో వేసిన స్టెప్పులను చూసి.. ‘కీళ్ల నొప్పులు ఉన్నట్లు చేస్తున్నాడేంటి? పాత స్టెప్పులనే ఇంత కష్టపడి తిప్పి తిప్పి వేస్తున్నాడు. మొన్న మోకాళ్లపై, ఇప్పుడు చేతిలో లుంగీ.. నీ వింత స్టెప్పులు, కుప్పి గెంతులు చూసి జనాలు నవ్వుకుంటున్నారు’ అంటూ జనాలు నెగెటీవ్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.


Next Story