- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యాక్షన్ డ్రామా ‘రాజా శివాజీ’లో సల్మాన్ ఖాన్.. అంచనాలను పెంచుతున్న రితేష్ కామెంట్స్
‘రాజా శివాజీ’ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఒక పవర్‌ఫుల్ క్యామియో రోల్‌లో కనిపించబోతున్నారట. తాజాగా, ఈ విషయాన్ని రితేష్ అధికారికంగా కన్ఫర్మ్ చేశారు.

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ జెనీలియా భర్త, దర్శకుడు రితేష్ దేశ్‌ముఖ్ స్వీయ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం ‘రాజా శివాజీ’ . ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక క్రేజీ వార్త తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ ఒక పవర్‌ఫుల్ క్యామియో రోల్‌లో కనిపించబోతున్నారట. తాజాగా, ఈ విషయాన్ని రితేష్ అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. సల్మాన్ ఖాన్ ఈ చిత్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ అత్యంత నమ్మకస్తుడైన పోరాట యోధుడు ‘జీవా మహాలా’ పాత్రను పోషించనున్నారు. 1659లో అఫ్జల్ ఖాన్‌తో జరిగిన చారిత్రాత్మక యుద్ధంలో శివాజీని కాపాడిన వీరుడే ఈ జీవా మహాలా అని అన్నారు. అయితే రితేష్ అడగగానే సల్మాన్ మారుమాట్లాడకుండా తన షెడ్యూల్ నుంచి రెండు రోజుల కాల్షీట్లు ఇచ్చి ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేశారని సమాచారం. ఓ షోలో రితేష్ ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తున్నప్పుడు స్టేజ్ పైన ఉన్న అభిషేక్ బచ్చన్ ఎంతో ఎగ్జైట్‌మెంట్‌తో రియాక్ట్ అయ్యారు.
సల్మాన్ రాకను వినగానే ఆయన నవ్వుతూ చప్పట్లు కొడుతున్న వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. వీరితో పాటు టబు, సంజయ్ దత్ వంటి స్టార్స్ ఈ చిత్రాన్న మరో స్థాయికి తీసుకెళ్లబోతున్నారు. కాగా.. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న పీరియడ్ యాక్షన్ డ్రామా మే 1, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. జియో స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమాను జెనీలియా దేశ్‌ముఖ్ నిర్మిస్తున్నారు. సల్మాన్ ఖాన్, రితేష్ దేశ్‌ముఖ్ కాంబినేషన్ గతంలో ‘లాయ్ భారీ’, ‘వేద్’ చిత్రాలలో మెరిసి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు ఈ హిస్టారికల్ మూవీతో వీరు ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో? అని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.






