'సలార్' ఒక చెత్త సినిమా.. నటి పాయల్ షాకింగ్ కామెంట్స్..

by Disha Web Desk 23 |
సలార్ ఒక చెత్త సినిమా.. నటి పాయల్ షాకింగ్ కామెంట్స్..
X

దిశ,వెబ్‌డెస్క్ : ప్రయాణం సినిమా తో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన బెంగాలీ భామ పాయల్‌ ఘోష్‌.కొన్ని హిందీ, పంజాబీ సినిమాల్లోనూ నటించిన తర్వాత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది. ఈ బెంగాలీ భామ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటుంది. స్టార్‌ హీరోలు, హీరోయిన్లపై కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ రచ్చ చేస్తూ ఉంటుంది.

తాజాగా పాయల్ ఘోష్ సలార్ గురించి కామెంట్స్ చెప్పి వార్తల్లో నిలిచింది. ప్రభాస్‌ సలార్‌, షారుఖ్‌ ఖాన్‌ డంకీ సినిమాలను ఉద్దేశిస్తూ ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. 'సలార్' ఓ చెత్త సినిమా అని..ఈ ఏడాది విడుదలైన సలార్, డంకీ, పఠాన్, జవాన్, యానిమల్ చిత్రాలు బాగాలేవు. జనాలను పిచ్చోళ్లను చేసేలా ఉన్నాయి. రాజ్ కుమార్ హిరాణీ తన కెరీర్ లో తొలిసారిగా ఓ ఫ్లాప్ సినిమా తీశారు' అని ట్విట్టర్ వేదికగా విమర్శించారు.ప్రస్తుతం పాయల్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read More..

అమ్మాయిల డ్రెస్ వేసుకుని పబ్లిక్‌గా తిరుగుతున్న స్టార్ హీరో !

Next Story

Most Viewed