ప్రభాస్ ఫ్యాన్స్ గుండెల్లో గుబులు పుట్టిస్తోన్న షాకింగ్ న్యూస్

by Disha Web Desk 9 |
ప్రభాస్ ఫ్యాన్స్ గుండెల్లో గుబులు పుట్టిస్తోన్న షాకింగ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సలార్’. ఈ మూవీ కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం కంప్లీట్ చేసుకుని సెప్టెంబరు 28 న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ ఇప్పటికే రెండు, మూడు సార్లు వాయిదా పడింది. కొన్ని సీన్స్ రీషూట్ చేయాలని.. డిసెంబర్ 22 వ తేదీన తప్పకుండా థియేటర్లలోకి వస్తుందని చెప్పారు. అడ్డొచ్చినా వాళ్లను తొక్కుకుంటూ వెళ్తుందని ఫ్యాన్స్‌కు గర్వంగా చెప్పారు.

అయితే డిసెంబరు 22న బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘డుంకీ’ సినిమా రిలీజ్ కాబోతుంది. రాజ్ కుమార్ హిరానీ లాంటి స్టార్ డైరెక్టర్‌తో షారుఖ్ చేస్తున్న మూవీ కాబట్టి సలార్‌ సినిమాకు బాలీవుడ్ థియేటర్లు భారీగా తగ్గుతాయి. అలాగే అదే రోజు హీలీవుడ్ బాక్సాఫీసును ఊపేసిన ‘ఆక్వా మ్యాన్’ సీక్వెల్ రాబోతుంది. దీంతో సలార్ మూవీకి భారీగా షోస్ కౌంట్ తగ్గిపోతుంది. కాగా ఈ చిత్రం సంక్రాతికి వాయిదా పడే అవకాశాలున్నాయని పండితులు చర్చిస్తున్నారు.


Next Story

Most Viewed