Salaar OTT : ‘సలార్’ ఓటీటీ స్ట్రీమింగ్ లాక్..

by Disha Web Desk 7 |
Salaar OTT : ‘సలార్’ ఓటీటీ స్ట్రీమింగ్ లాక్..
X

దిశ, సినిమా : ప్రశాంత్ నీల్-ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘సలార్ : సీజ్ ఫైర్’ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, టిన్ను ఆనంద్, ఈశ్వరీ రావు, శ్రుతి హాసన్ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 175కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కాగా ఈ మూవీ డిజిటల్ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దాదాపు రూ. 60 కోట్లకు స్ట్రీమింగ్ హక్కులను పొందినట్లు తెలుస్తుంది. ఇక స్టార్ మా టీవీ శాటిలైట్ రైట్స్ బ్యాగ్ చేసినట్లు సమాచారం. కాగా త్వరలోనే డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.


Next Story

Most Viewed