సెక్స్‌ చేస్తున్నప్పుడు వచ్చే సౌండ్ చేయాలని వేధించిన రియాలిటీ షో.. నిరాకరిస్తే భోజనం పెట్టకుండా టార్చర్

by Dishanational2 |
సెక్స్‌ చేస్తున్నప్పుడు వచ్చే సౌండ్ చేయాలని వేధించిన రియాలిటీ షో.. నిరాకరిస్తే భోజనం పెట్టకుండా టార్చర్
X

దిశ, సినిమా : గ్లామర్ డాల్ సాక్షి చోప్రా నెట్‌ఫ్లిక్స్ రియాలిటీ షో ‘సోషల్ కరెన్సీ’లో భయంకరమైన లైంగిక వేధింపుల అనుభవాల గురించి నెట్టింట పోస్ట్ చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతూ.. నిర్వాహకులు దాదాపు ఏడాదిపాటు తన చుట్టూ తిరిగారని తెలిపింది. చివరకు ప్రతిరోజు అమ్మకు కాల్ చేయిస్తామనే హామీ మేరకు ఇందుకు సైన్ చేసినట్లు చెప్పింది. కానీ షోలోకి ఎంటర్ అయ్యాక మదర్‌తో మాట్లాడించేందుకు నిరాకరించారని.. అన్‌నోన్ పర్సన్స్ తన వీపుపై గీకడం, సెక్స్‌లో ఉద్వేగంతో కూడిన లాంటి శబ్దాలు చేయడం, భోజనం కూడా పెట్టకుండా బాధించారని తెలిపింది. గ్లోవా క్లబ్‌కు చెందిన వారితో డ్యాన్స్ చేయాలని, సెక్సువల్ డర్టీ రిమార్క్‌లను పాస్ చేయాలని డిమాండ్ చేశారని.. లేదంటే భోజనం కట్ అని హెచ్చరించినట్లు వివరించింది. ఈ అనుభవం తనకు గుణపాఠం నేర్పిందని.. ఇకపై ఇలాంటి షోస్ చేయనని క్లారిటీ ఇచ్చింది. దీంతో అభిమానులు ఆమెకు మద్దతిస్తున్నారు.

సెక్స్‌తో ఆరోగ్య సమస్యలకు చెక్.. వారానికి ఎన్నిసార్లు చేయాలి..?


Next Story

Most Viewed