- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలీవుడ్‌లో మరో బంపర్ ఆఫర్ అందుకున్న సాయి పల్లవి.. స్టార్ కిడ్‌తో రొమాన్స్.. రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి(Sai Pallavi) వరుస హిట్స్ సాధిస్తూ ఫుల్ ఫామ్‌లో ఇండస్ట్రీకి షేక్ చేస్తోంది.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి(Sai Pallavi) వరుస హిట్స్ సాధిస్తూ ఫుల్ ఫామ్‌లో ఇండస్ట్రీకి షేక్ చేస్తోంది. ఇటీవల అమరన్, తండేల్ వంటి సూపర్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం సాయి పల్లవి బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తోంది. అక్కడ వరుస అవకాశాలు అందుకుంటూ ఈ అమ్మడు ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణ’లో నటిస్తోంది. ఇందులో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్ నటిస్తుండగా.. నీతేష్ తివారి తెరకెక్కిస్తున్నారు. ఇందులో యశ్ రావణుడిగా కనిపించనున్నారు. ఇదిలా ఉంటే.. సాయి పల్లవి బాలీవుడ్‌లో మరో బంపర్ ఆఫర్ అందుకుంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా సైలెంట్‌గా కంప్లీట్ చేసినట్లు సమాచారం. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్(Junaid Khan) ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఏక్ దిన్’ మూవీలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది.
సునీల్ పాండే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ మూవీని బాలీవుడ్ స్టార్ నిర్మాత మన్సూర్ ఖాన్, ఆమిర్ ఖాన్ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక వీరిద్దరూ ఏకంగా 17 ఏళ్ల తర్వాత కలిసి పని చేస్తుండటం విశేషం. తాజాగా, ‘ఏక్ దిన్’ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రం నవంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. సాయి పల్లవి సైలెంట్‌గా బాలీవుడ్‌లో వరుస అవకాశాలు అందుకుంటూ క్రేజీ బ్యూటీగా మారడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు.






