- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోతో సినిమా అంటే మూవీ టీం దర్జాగా గడిపేయవచ్చు అని అందరూ అనుకుంటారు. కానీ స్టార్ హీరోకి తగ్గా హీరోయిన్ వెతకడం టీంకి పెద్ద టాస్క్‌గా మారుతుంది. ఇక అదే హీరోకి చెల్లెలి పాత్రలో కూడా మరో హీరోయిన్ ఉండాలంటే టీం జుట్టుపీక్కోవాల్సిందే. హీరోయిన్‌లు కూడా స్టార్ హీరో చెల్లెలి పాత్ర అంటే కాస్త వెనకడుగు వేస్తుంటారు. చెల్లెలి పాత్ర చేయడం వల్ల తన కెరీర్‌లో స్టార్ హీరోలతో నటించే అవకాశాలు తగ్గిపోతాయేమో అని. ప్రస్తుతం నేచురల్ బ్యూటీ సాయి పల్లవి కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటుంది.
ఇటీవల మెగాస్టార్ చిరంజీవి సినిమాలో చెల్లెలి పాత్రకు అమ్మడి టీం సంప్రదించింది. కానీ డేట్స్ కారణంగా సాయి పల్లవి సినిమా నుంచి తప్పుకుంది. ఇప్పుడు మరోసారి అమ్మడి చెంతకు అలాంటి ఆఫర్ ఒకటి వచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రం కాంబోలో తెరకెక్కనున్న సినిమాలో మహేష్ చెల్లెలి పాత్రకి సాయిపల్లవిని అడిగారట. దీంతో మరోసారి సాయిపల్లవి డైలమాలో పడిపోయింది. మహేష్28లో చెల్లెలి పాత్ర చేస్తే తర్వాత స్టార్ హీరోలతో సినిమా అవకాశాలు తగ్గుతాయేమో అని ఆలోచిస్తోందట. మరి ఈ సినిమాకు నేచురల్ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో చూడాలి.






