Sai Dharam Tej :‘నువ్వు లేకపోతే చాలా కష్టంగా ఉంది’’ సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2023-06-13 07:00:23  IST  )

ప్రస్తుతం చాలా మంది కుక్కలను పెంచుకుంటూ వాటితో ఓ ప్రత్యేకమైన బంధాన్ని ఏర్పరచుకుంటున్నారు.

Sai Dharam Tej :‘నువ్వు లేకపోతే చాలా కష్టంగా ఉంది’’ సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం చాలా మంది కుక్కలను పెంచుకుంటూ వాటితో ఓ ప్రత్యేకమైన బంధాన్ని ఏర్పరచుకుంటున్నారు. వాటికి మనుషుల కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ చిన్న పిల్లల మాదిరిగా చూసుకుంటున్నారు. అలాగే సెలబ్రీటీలు కుక్కలను పెంచుతూ ఫ్యామిలీ మెండర్స్‌లా చూస్తున్నారు. అయితే టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఓ కుక్కని పెంచుకుంటున్నాడు. దానికి టాంగో అనే పేరు పెట్టుకున్నాడు. తాజాగా, తన కుక్క టాంగో చనిపోవడంతో ట్విట్టర్‌లో సాయ్ ధరమ్ తేజ్ ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. ‘‘నిన్ను తలుచుకున్నప్పుడు నా మనసు ఆనందంగా ఉంటుంది. నువ్వు లేకపోతే చాలా కష్టంగా ఉంది. నన్ను నువ్వు రక్షించావు, నవ్వించావు. నా కష్టాల్లోనూ, నా సంతోషాల్లోనూ నువ్వు నాతో ఉన్నావు. నాకు ఎంతో ప్రేమను ఇచ్చిన నిన్ను పొందడం నా అదృష్టం. నువ్వు నా జీవితంలోకి వచ్చిన మొదటి రోజు ఇప్పటికి స్పెషల్ మూమెంట్ బాగా గుర్తుంది. లవ్ యు మై బండ ఫెలో.. టాంగో..’’ అంటూ రాసుకొచ్చాడు.

Also Read: ఆసక్తి రేకెత్తిస్తున్న మాస్ మహారాజ రవితేజ 73వ సినిమా ‘ఈగల్’ టీజర్..

Next Story