- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డిజాస్టర్ డైరెక్టర్‌తో మెగాహీరో మూవీ ?
టాలీవుడ్ స్టార్ హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా వారసత్వాన్ని

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్... వరుసగా సినిమాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకొని దూసుకు వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలోనే 2014లో పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో... ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సాయి ధరమ్ తేజ్.. దాదాపు 15 సినిమాల వరకు చేశాడు.
లేటెస్ట్ గా... విరూపాక్ష సినిమాతో బంపర్ హిట్ అందుకున్నాడు సాయిధరమ్ తేజ్. 2023 సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా బంపర్ హిట్ అందుకోవడమే కాకుండా.. సాయి ధరంతేజ్ కు మంచి మార్కులు తీసుకువచ్చింది. అయితే ఆ తర్వాత కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు సాయి ధరమ్ తేజ్. ప్రస్తుతం.. రోహిత్ కెపి దర్శకత్వంలో ఓ సినిమా అయితే చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత ఓ డిజాస్టర్ దర్శకుడికి ఛాన్స్ ఇవ్వబోతున్నాడట సాయి ధరమ్ తేజ్.
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా చేసిన టైగర్ నాగేశ్వరరావు కు దర్శకత్వం వహించిన వంశీతో ఇప్పుడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సినిమా చేయబోతున్నాడని చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల చివర్లో అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు సమాచారం అందుతుంది. ఫ్లాప్ డైరెక్టర్ తో సినిమాలు ఏంటి అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. కాగా ఇప్పటివరకు డైరెక్టర్ వంశీ మూడే సినిమాలు చేశాడు. అందులో దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు ఉన్నాయి.






