- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రుక్మిణి వసంత్ కు మరో బంపర్ ఆఫర్..ఇక థియేటర్లలో రచ్చే !
విజయ్ దేవరకొండ దర్శకుడు విక్రమ్ కే కుమార్ కాంబినేషన్ లో కొత్త సినిమా.. ఇందులో రుక్మిణి వసంత్ ను హీరోయిన్ గా ఫైనల్

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు రుక్మిణి వసంత్ పేరు మారుమోగుతున్న సంగతి తెలిసిందే. ఆమె తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేదు.. కానీ కాంతార చాప్టర్ 1 సినిమాతో ఆమె క్రేజ్ మాత్రం అమాంతం పెరిగిపోయింది. 2024 సంవత్సరంలో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ బ్యూటీ. ఇక కాంతార చాప్టర్ 1 సినిమాలో కనకవతి పాత్ర చేసి అందరిని మెప్పించింది. త్వరలో ఎన్టీఆర్ సరసన నటించబోతోంది ఈ అందాల తార.
డ్రాగన్ పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ ఫైనల్ అయిందట. అయితే ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ సినిమాలో ఈ బ్యూటీ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. విజయ్ దేవరకొండ దర్శకుడు విక్రమ్ కే కుమార్ కాంబినేషన్ లో కొత్త సినిమా రాబోతున్నట్లు నిన్నటి నుంచి వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయబోతున్నారట. అయితే ఇందులో రుక్మిణి వసంత్ ను హీరోయిన్ గా ఫైనల్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పూర్తి కాలేదని సమాచారం. పూర్తయిన వెంటనే సినిమాపై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.






