వామ్మో.. అంతర్జాతీయ అవార్డుల కోసం RRR టీమ్ ఎంత ఖర్చు చేసిందో తెలుసా..?

by Disha Web Desk 12 |
వామ్మో.. అంతర్జాతీయ అవార్డుల కోసం RRR టీమ్ ఎంత ఖర్చు చేసిందో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు సినిమా స్థాయిని విశ్వవ్యాప్తం చేసిన దర్శకుడు రాజమౌళి. బాహుబలితో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఆయన, ఆర్ఆర్ఆర్‌తో మరోసారి సత్తా చాటారు. RRR చిత్రం ప్రపంచ వ్యాప్తాంగా భారీ హిట్ కొట్టింది. దీంతో పాటుగా దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా ప్రముఖ అవార్డులను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా అందుకుంది. అయితే దీని ప్రచారం కోసం RRR టీమ్ సుమారు రూ.88 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది.

ఈ చిత్రం ఆస్కార్‌కు భారతదేశం నుంచి అధికారికంగా ఎంపిక కాలేకపోయింది. దర్శకుడు SS రాజమౌళి, అతని బృందం ఒక్కొక్కరుగా అకాడమీ అవార్డుల రేసులో చేరాలని నిర్ణయించుకున్నారు. కాగా, ఈ ఖర్చులో భారీ వాటా రాజమౌళి స్వయంగా అందించగా, మిగిలినది బాక్సాఫీస్ కలెక్షన్ల నుండి తీసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే కేవలం అవార్డుల కోసమే RRR టీమ్ రూ.88 కోట్లు ఖర్చు చేసిందా అనే దానిపై స్పష్టత రావాల్సిఉంది.

ఇవి కూడా చదవండి : RRR: చేతిలో చీపురు, చెత్తబుట్టతో తారక్, చరణ్!



Next Story

Most Viewed