రోషన్ సఫారీ ప్రారంభమవుతుంది.. ‘మోగ్లీ’ అనౌన్స్‌మెంట్‌తో సడెన్ షాకిచ్చినమూవీ మేకర్స్..

by Mallepaka Hamsa |

స్టార్ యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల(Roshan Kanakala) ‘బబుల్‌గమ్’ సినిమాతో హీరోగా మారాడు.

రోషన్ సఫారీ ప్రారంభమవుతుంది..  ‘మోగ్లీ’  అనౌన్స్‌మెంట్‌తో సడెన్ షాకిచ్చినమూవీ మేకర్స్..
X

దిశ, సినిమా: స్టార్ యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల(Roshan Kanakala) ‘బబుల్‌గమ్’ సినిమాతో హీరోగా మారాడు. మొదటి మూవీతోనే మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు. ప్రస్తుతం రోషన్ ‘మోగ్లీ’ (Mowgli)మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రానికి ‘కలర్ ఫొటో’ ఫేమ్ సందీప్ రాజ్(Sandeep Raj) దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ సాక్షి మడోల్కర్ (sakshi mahdolkar) హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయం కాబోతుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా, ‘మోగ్లీ’ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చి మూవీ మేకర్స్ అందరినీ షాక్‌కు గురిచేశారు. ఈ సినిమా ఆగస్టు 28న థియేటర్స్‌లో విడుదల కాబోతున్నట్లు వెల్లడించడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇంకా నాలుగు రోజులే ఉన్న సమయంలో రిలీజ్ డేట్ ప్రకటించడం ఏంటనీ ప్రమోషన్స్ ఎప్పుడు చేస్తారని షాక్ అవుతున్నారు. ఇక విడుదల డేట్‌తో పాటు సఫారి ప్రారంభమవుతుందంటూ రోషన్ కనకాల గుర్రాన్ని పట్టుకుని నిల్చున్న పోస్టర్‌ను షేర్ చేసి హైప్ పెంచారు.

link

Next Story