ప్లీజ్‌ అక్కా.. నన్ను ఒంటరిగా వదిలెయ్ : రిషబ్ పంత్ రిక్వెస్ట్ వైరల్

by Mallepaka Hamsa |   (  Updated:2022-08-11 08:12:27  IST  )

దిశ, సినిమా : బీటౌన్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలాకు ఇండియన్ క్రికెటర్ రిషబ్ పంత్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. అప్పట్లో వీరిద్దరి మధ్య ఎఫైర్‌ ఉందంటూ రకరకాలుగా రూమర్స్ వినిపించిన సంగతి తెలిసిందే..Latest Telugu News

ప్లీజ్‌ అక్కా.. నన్ను ఒంటరిగా వదిలెయ్ : రిషబ్ పంత్ రిక్వెస్ట్ వైరల్
X

దిశ, సినిమా : బీటౌన్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలాకు ఇండియన్ క్రికెటర్ రిషబ్ పంత్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. అప్పట్లో వీరిద్దరి మధ్య ఎఫైర్‌ ఉందంటూ రకరకాలుగా రూమర్స్ వినిపించిన సంగతి తెలిసిందే. పైగా ఊర్వశి కూడా తనను ఒక వ్యక్తి ప్రేమిస్తున్నాడని, కలిసేందుకు తపిస్తూ వెయిట్‌ చేస్తున్నాడని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడమే కాక అతని పేరును షార్ట్‌ఫామ్‌లో 'ఆర్‌పీ' అని చెప్పింది. దీంతో ఆమె రిషబ్‌ పంత్‌ పేరునే చెప్పిందని నెట్టింట మొదలైన చర్చ కాస్త వైరల్‌గా మారింది. ఇక ఈ రూమర్స్‌ చూసి షాకైన రిషబ్.. రీసెంట్‌గా ఇన్‌స్టాలో ఓ పోస్ట్ షేర్‌ చేశాడు. 'కొంతమంది పేరు, ప్రఖ్యాతల కోసం ఏస్థాయికైనా దిగజారతారు.

తమ స్వార్థ ప్రయోజనాల కోసం అవతలి వ్యక్తులను ఇబ్బందులకు గురిచేస్తారు. ఇంటర్వ్యూల్లో ఇష్టమొచ్చినట్లు మాట్లాడం గమనిస్తే చాలా ఫన్నీగా అనిపిస్తోంది. దేవుడు అలాంటివాళ్లపై కరుణ చూపించాలి. ప్లీజ్‌ అక్కా! నన్ను ఒంటరిగా వదిలేయండి. అబద్దాలు ఆడడానికైనా ఒక లిమిట్‌ ఉంటుంది' అంటూ రిక్వెస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో, పోస్ట్ వైరల్ అవుతున్నాయి.

Anchor Anasuya: జబర్దస్త్‌ను అందుకే వదిలేశా.. యాంకర్ అనసూయ


Next Story