Anchor Anasuya: జబర్దస్త్‌ను అందుకే వదిలేశా.. యాంకర్ అనసూయ

by Hamsa |
Here is the Reason, Why Anchor Anasuya left Jabardasth
X

దిశ, సినిమా : Here is the Reason, Why Anchor Anasuya left Jabardasth| బుల్లితెరపై సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న కామెడీ షో 'జబర్దస్త్'. కొన్నేళ్లుగా ప్రేక్షకాదరణ పొందిన ఈ షో నుంచి కమెడియన్స్, ఆ తర్వాత జడ్జిలు, ప్రస్తుతం యాంకర్స్.. ఇలా ఒక్కొక్కరుగా బయటికి వెళ్లిపోతున్నారు. దీంతో టీఆర్‌పీ రేటింగ్స్ పడిపోయాయి. ఇక రీసెంట్‌గా హాట్ యాంకర్ అనసూయ సైతం జబర్దస్త్‌కు బ్రేక్ ఇచ్చిందని తెలిసిందే. ఈ మేరకు జబర్దస్త్‌తో తొమ్మిదేళ్ల ప్రయాణానికి ఫుల్‌స్టాప్ పెట్టిన యాంకర్.. కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే అనసూయ ఈ షో నుంచి వైదొలగిన తర్వాత అనేక రూమర్స్ పుట్టుకొచ్చినప్పటికీ ఆమె సమాధానమివ్వలేదు.

కానీ తాజా ఇంటర్వ్యూలో జబర్దస్త్‌ను వదిలిపెట్టేందుకు గల కారణాలను రివీల్ చేసింది. సినిమా ఆఫర్లు పెరగడంతోనే జబర్దస్త్‌కు గ్యాప్ ఇవ్వాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది. జబర్దస్త్‌ను విడిచిపెట్టడం ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదని, రెండేళ్ల నుంచి ఈ విషయంలో మదన పడ్డానని తెలిపింది. ఒక నటిగా కూడా తనను తాను నిరూపించుకునేందుకే షోను వదులుకున్నట్లు చెప్పింది.

ఇది కూడా చదవండి: రోల్.. కెమెరా.. యాక్షన్.. కాలు విరగొట్టుకున్న స్టార్ హీరోయిన్


Next Story

Most Viewed