నటి మెడలో రూ.5.7 కోట్ల విలువైన డైమండ్ వాచ్.. నెటిజన్లు షాక్

by Dishanational2 |
నటి మెడలో రూ.5.7 కోట్ల విలువైన డైమండ్ వాచ్.. నెటిజన్లు షాక్
X

దిశ, సినిమా: హాలీవుడ్ నటి, సింగర్ రిహన్నా మరోసారి నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. పారిస్‌లో జరిగిన 2023 లూయిస్ విట్టన్ ఫ్యాషన్ షోలో రూ. 5.7 కోట్ల విలువడైన డైమండ్ వాచ్‌ మెడలో ధరించగా.. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ మేరకు జాకోబ్ అండ్ కో వాచ్ కంపెనీ దీనిని తయారు చేయగా.. రిహన్నా చిరకాల మిత్రుడు, వాచ్ డిజైనర్ జాకబ్ అరబో దీని చోకర్‌ను రూపొందించాడు. కాగా ఈ గడియారం విలువ దాదాపు రూ.5.7 కోట్లు ఉండటం విశేషం. కాగా వాచ్‌ను మెడకు చోకర్‌లా ధరించడం కూడా ఇదే తొలిసారి కావటం మరో విశేషం. మొత్తం 368 వజ్రాలు పొదిగిన వాచ్‌ను 47 మిల్లీమీటర్ల వైట్ గోల్డ్ బ్రిలియంట్ ఫ్లైయింగ్ టూర్‌బిల్లన్‌ను చోకర్‌గా ధరించడానికి వీలుగా తయారు చేశారు. ఇక వజ్రాల గడియారం ధరించి బేబీ బంప్‌తో క్యాట్ వాక్ చేసిన నటి ప్రేక్షకులను తెగ అలరించింది.

Read More... తొడలు, నడుము చూపిస్తేనే అవకాశం ఇస్తారా! అర్చన

Next Story

Most Viewed